2 May, 2026 | 9:23 PM

Breaking News

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం   •   విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి   •   మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •  

సహజ రంగులతో హోలీ వేడుకలు జరుపుకోవడం అభినందనీయం

04-03-2026 12:47 AM

సూర్యాపేట, మార్చి 3 (విజయక్రాంతి) : మానవాళికి హాని చేయని సహజ రంగులతో హోలీ వేడుకలు జరుపుకోవడం అభినందనీయమని మున్సిపల్ చైర్ పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్ష్యాది తెలిపారు. మంగళవారం హోలీ పండుగలు పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద గ్రీన్ క్లబ్ ట్ర స్ట్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆమె మాట్లాడుతూ సూర్యాపేట పట్టణ ప్రజలు ప్రశాంత వాతావరణంలో కులమతాలకతీతంగా హోలీ వేడుకలు జరుపుకోవడం అభినందనీయమన్నారు. గ్రీన్ క్లబ్ ట్రస్ట్ గత కొన్ని సంవత్సరాలుగా పర్యావరణ సిద్ధమైన హోలీ రంగులతో వేడుకలు నిర్వహించుకోవడం శుభపరిణామం అన్నారు. ఈ సందర్భంగా ఒకరికి ఒకరు హోలీ రంగులు  చల్లుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో సుధాకర్ పివిసి మేనేజింగ్ డైరెక్టర్ మీలా మహదేవ్, ప్రముఖ న్యాయవాది జి శశిధర్ గ్రీన్ క్లబ్ ట్రస్ట్ అధ్యక్షులు ముప్పారపు నరేందర్ ప్రధాన కార్యదర్శి తోట కిరణ్ తో పాటు ముప్పారపు నాగేశ్వరరావు, రాచర్ల కమలాకర్ , రాచకొండ శ్రీనివాస్, డి.నాగరాజు, శ్రవణ్ కుమార్, ఉప్పల శ్రీదేవి,  సువర్ణ లక్ష్మి, హేమమాలినిలు పాల్గొన్నారు.