హోలీ.. రంగుల కేళీ
04-03-2026 12:47 AM
సంబరాల్లో మునిగితేలిన ప్రజలు
హైదరాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. రంగుల పండుగను చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా జరుపుకున్నారు. పల్లె నుంచి పట్నం దాకా ప్రతి గల్లీ రంగుల మయంగా మారింది. ఉదయం నుండే యువత రోడ్లపైకి వచ్చి రంగులు పూసుకుంటూ సందడి చేశారు.
రసాయన రంగుల కంటే ప్రకృతి సిద్ధమైన రంగుల వైపు ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపారు. సోమవారం రాత్రి ప్రధాన కూడళ్లలో ’కాముని దహనం’ నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా మంటలు వేసి పూజలు నిర్వహించారు. ఉస్మానియా క్యాంపస్‌లో విద్యార్థులు జరిపిన వేడుకలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు హాజ రై సందడి చేశారు.




