ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు
కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న జిల్లా పార్టీ శ్రేణులు...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): పార్టీ కోసం పదవులను తృణ ప్రాయంగా త్యజించిన త్యాగమూర్తి సోనియా గాంధీ అని మాజీ మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దిగంబర్ రావు పాటిల్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలలో ఆయన పాల్గొన్నారు. పెద్ద ఎత్తున హాజరైన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని తమ అభిమాన నాయకురాలి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల సెంటిమెంట్ గమనించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని కొనియాడారు. ఆమె సూచనలు సలహాలకు అనుగుణంగా ప్రతీ నాయకుడు కార్యకర్త నడుచుకుంటూ కాంగ్రెస్ పార్టీ అనుకున్న లక్ష్యం వైపు ముందడుగు వేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మహిళ నాయకులురాళ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.






