4 May, 2026 | 10:17 PM

దమ్మపేట బిజెపి శ్రేణుల సంబరాలు

04-05-2026 09:08 PM

దమ్మపేట,(విజయక్రాంతి): సోమవారం మూడు రాష్ట్రాలలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలలో బిజెపి పార్టీ విజయ ఢంకా మోగించడంతో దమ్మపేటలో అశ్వరావుపేట నియోజకవర్గ బిజెపి నాయకులు తంబళ్ల రవి ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దమ్మపేట వైఎస్ఆర్ సెంటర్లో స్థానిక బిజెపి నాయకులు స్వీట్లు పంచి, టపాసులు కాలుస్తూ ఘనంగా సంబరాలు నిర్వహించారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో అన్ని రాష్ట్రాలలో బీజేపీ పార్టీ జెండా ఎగురుతుందని, రానున్న రోజుల్లో తెలంగాణలో వచ్చేది బిజెపి పార్టీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ధారా నాగేశ్వరావు, మైనార్టీ నాయకులు షేక్ బాజీ, కారం రత్నకుమారి, శ్రీనివాసరావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.