బీజేపీ నాయకుల సంబరాలు
కరీంనగర్ సిటీ, జూన్ 4: కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ అధిక మెజార్టీతో గెలిచిన సందర్భంగా తిమ్మాపూర్ మండల బీజేపీశాఖ ఆధ్వర్యంలో మంగళవారం సంబరాలు జరుపుకున్నారు. పటాకులు పేల్చి, మిఠాయిలు పంచుకున్నారు. మైనార్టీకి చెందిన మహిళా కార్యకర్త సంబరాల్లో పాల్గొని జై బీజేపీ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు సుగుర్తి జగదీశ్వరాచారి మాట్లాడుతూ.. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు ప్రలోభాలకు గురిచేసినప్పటికీ ఓటర్లు మాత్రం బీజేపీని గెలిపించారని అన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఎడ్ల జోగిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు కిన్నెర అనిల్, గొట్టెముక్కల తిరుపతిరెడ్డి, బీజేవైఎం అధ్యక్షులు గడ్డం అరుణ్, స్థానిక నాయకులు వేల్పుల రవీందర్‌యాదవ్, పబ్బ తిరుపతి, ఎడ్ల భూంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.






