calender_icon.png 6 September, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీఎస్టీ తగ్గింపుతో సంబురాలు

06-09-2025 12:00:00 AM

ఎల్బీనగర్, సెప్టెంబర్ 5 : కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్నురేట్ల తగ్గింపులో పేదలపై ఆర్థిక భారం తగ్గుతుందని, నిత్యావసరాలు, ఇతర వస్తువులు, సేవల ధరలు నియంత్రణలో ఉంటాయని బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు పేర్కొన్నారు. జీఎస్టీ ఎత్తివేతపై ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు సంబురాలు నిర్వహించారు. ఆయా డివిజన్లలో కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పూలమాలలు వేసి, క్షీరాభిషేకం చేశారు.

చైతన్యపురి డివిజన్ లో బీజేపీ అధ్యక్షుడు నవీన్ యాదవ్  ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కార్పొరేటర్ రంగా నర్సింహ గుప్తా ముఖ్యఅతిథిగా పాల్గొని, ప్రసంగించారు. దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని 28శాతం ఉన్న జీఎస్టీని 18శాతం తగ్గించారని తెలిపారు. చైతన్యపురి మెయిన్ రోడ్ చౌరస్తాలో  ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. 

హయత్ నగర్ లో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు గంగాని శ్రీనివాస్ నేతృత్వంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి  క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరే టర్ కళ్లెం నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ... పేద మధ్యతరగతి కుటుంబాలను  దృష్టిలో అతి తక్కువ ధరకు నిత్యవసర వస్తువులు అందించే విధంగా జీఎస్టీ తగ్గించారని తెలిపారు. జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ రద్దు చేస్తూ ప్రతి ఒక్కరికీ ఆరోగ్య, ఆర్థిక భద్రత అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు.

  కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అర్బన్ ప్రధాన కార్యదర్శి బండారి భాస్కర్, నాయకులు ఉగాది ఎల్లప్ప, పారంద మహేష్, ఎర్రవెల్లి సత్యనారాయణ, వస్పరి వెంకటేష్, ఈటబోయిన నరసింహ, బాలు, సూర్య నాయక్, మొగులయ్య,గోపాల్, ప్రేమ్, అఖిల్, భరత్, చిరంజీవి పాల్గొన్నారు. హస్తినాపురం డివిజన్ లోని సరస్వతి నగర్ - ఓంకార్ నగర్ లో  బీజేపీ డివిజన్ అధ్యక్షుడు ఎరుకల మల్లేశ్ గౌడ్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు.

బీజేపీ ఇన్ఛార్జి  సామ రంగారెడ్డి  ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.  మన్సూరాబాద్ డివిజన్ లోని సహారా రోడ్డులో ఉన్న వివేకానంద విగ్రహం వద్ద ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి క్షీరాభిషేకం చేశారు. నాగోల్ లో కార్పొరేటర్ చింతల అరుణా సురేందర్ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు సంబురాలు నిర్వహించారు.  బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

జిఎస్టీ తగ్గించి పేద ప్రజలకు గిఫ్ట్ ఇచ్చిన కేంద్రం..

వికారాబాద్, సెప్టెంబర్-05 (విజయ క్రాంతి): పేద ప్రజలకు వినియోగించే వస్తువులకు జిఎస్టీ తగ్గించి కేంద్ర బీజేపీ ప్రభుత్వం గిఫ్ట్ ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి.సదానంద రెడ్డి అన్నారు.జిఎస్టీ తగ్గింపు నిర్ణయంతో పేద మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు పెంచుకోవడానికి దోహద పడుతుంద న్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంఆర్ పి చౌరస్తా వద్ద వికారాబాద్ బీజేపీ మండల శాఖ అధ్యక్షులు శివరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సదానంద రెడ్డి మాట్లాడుతూ.... సామా న్యులకు అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో మోడీ  జిఎస్టీని తగ్గింపు చరిత్రాత్మక నిర్ణ యం తీసుకుందని హర్షం వ్యక్తం చేశారు. పలు స్లాబ్‌లుగా ఉన్న జిఎస్టీని రెండు స్లాబ్ లుగా మార్చడం ఎంతో మంచిందన్నారు.   

తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని,స్థానిక సంస్థ ఎన్నికలో బీజేపీని గెలిపిస్తే మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ అవుతాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ మెంబర్ బస్వలింగం,మాజీ కౌన్సిలర్ శ్రీదేవి, మాజీ సర్పంచులు విజయ్ రాజు,వెంకటయ్య,బుచ్చిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు గోపాల్ ,శ్రీశైలం,మండల కార్యదర్శులు యాదగిరి,మహిపాల్, వివిధ బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

జి ఎస్ టి తగ్గింపు, మినహాయింపుతో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

ఘట్ కేసర్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి) : మేడ్చల్ రూరల్ జిల్లా బిజెపి అధ్యక్షులు బుద్ది శ్రీనివాస్  ఆదేశానుసారం బిజెపి మున్సిపల్ అధ్యక్షుడు కొమ్మిడి మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఘట్ కేసర్ పట్టణంలోని  అంబేద్కర్ చౌరస్తాలో  కేంద్ర ప్రభుత్వం జిఎస్టి స్లాబ్ రెట్లు భారీగా తగ్గించడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించడం, మెడికల్, లైఫ్ ఇన్సూరెన్స్ పై జి ఎస్ టి  పూర్తిగా ఎత్తివేసారు.

దీంతో దేశంలోని పేద మధ్యతరగతి ప్రజలకు భారీ లాభం చేకూరనున్న సందర్భంగా బిజెపి నాయకులు, కార్యకర్తలు దేశ ప్రధాని నరేంద్రమోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సింగిరెడ్డి వెంకట్ రెడ్డి విచ్చేశారు. 

జిల్లా ఉపాధ్యక్షులు కంభం లక్ష్మారెడ్డి, మున్సిపల్ ఉపాధ్యక్షులు గుండ్ల రామతీర్థ గౌడ్, పడిగం వీరేశం, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి చల్లక శ్రీధర్, మంగు రాధిక, కార్యదర్శి సిద్దిరాజ్, కోశాధికారి మేడబోయిన నరేష్, సీనియర్ నాయకులు పల్లె మధు, మంగు శ్రీనివాస్ రావు, ఏనుగు మచ్చేందర్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీరాములు, జైపాల్ రెడ్డి, భానుప్రకాష్, బాల్ నర్సింహ, శ్రీనివాస్,  మహేష్, సురేందర్ యాదవ్, మనోజ్ కుమార్, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.