06-09-2025 12:00:34 AM
నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి) : ఎటుచూసినా చూసినా ఉత్సవ శోభ.. ఎక్కడ విన్నా గణపతి నామస్మరణ.. కోలాటాలు.. డీజే పాటలు.. బ్యాండ్ చప్పుళ్లు.. తీన్మార్ స్టెప్పుల నడుమ లంబోధరుడిని నిమజ్జన శోభాయాత్రలు అట్టహ సంగా సాగాయి. నవరాత్రులు ఘనంగా పూజలు అందుకున్న గణనాధులను శుక్రవారం ప్రత్యేకంగా అలంకరించి వాహ నాలపై భక్తిశ్రద్ధలతో తరలించి గంగమ్మ ఒడికి చేర్చారు.
పట్టణాల్లో శోభాయాత్ర సంబురం అంబరాన్నంటింది. గల్లీగల్లీ జై గణేశ్ మహారాజ్కీజై నినాదాలతో హోరెత్తాయి. నల్లగొండ పట్టణంలోని పాతబస్తీ హనుమాన్నగర్లో ఏర్పాటుచేసిన ఒకటో నెంబర్ గణపయ్య విగ్రహం వద్ద రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు. మంత్రితోపాటు కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్రపవార్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కర్నాటి యాదగిరి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి పూజల్లో పాల్గొన్నారు.
జిల్లాకేంద్రంలో శోభాయాత్రలు ఉదయం ప్రారం భం కాగా, సాయంత్రానికి ఒక్కోక్క విగ్రహం క్లాక్టవర్ సెంటర్కు చేరువడంతో అక్కడంతా ఉత్సవ వాతావరణం నెలకొంది. గణనాథులను చూసేందుకు తరలివచ్చిన భక్తులతో పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. శోభయా త్ర సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నకిరేకల్‌లో..
నకిరేకల్ సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా వీధి వీధినా విఘ్నేశ్వరుని, గల్లి గల్లిన గణనాథులనిప్రతిష్టించుకుని. భక్తిశ్రద్ధలతో నవరాత్రులు పూజలు నిర్వహించుకోని ప్రజలంతా సుఖ సంతోషాలు. సౌభాగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు , చేసే ప్రతి పనిలో మంచి జరగాలని, విద్యా, వ్యాపారం, ఉద్యోగం, కలిసి రావాలని. విఘ్నేశ్వరునీ వేడుకున్నారు. నవరాత్రులు పూజలు అందుకున్న విఘ్నేశ్వరుడికి నేడు శుక్రవారం అంగరంగ వైభ వంగా పిల్లా పాపలతో కుటుంబ సమేతంగా గల్లీలో వీధుల్లో ప్రజలంతా ఒకటై వీడ్కోలు పలికారు.
ఎటుచూసినా, ఎక్కడ విన్నా గణేష మహారాజ్ కి జై నామస్మరణలతో మారుమోగయి. మహిళలు కోలాటా లతో, చప్పట్లతో. బతుకమ్మ ఆటపాటలతో ఉత్సాహంగా ఊరేగింపు చేశారు. డీజే పాటలు.. బ్యాండ్ చప్పుళ్లు.. తీన్మార్ స్టెప్పుల నడుమ గణనాధుని నిమజ్జన శోభాయాత్రలు ఘనంగా నిర్వహించారు. గణనాథుని గంగమ్మ చెంతకు చేర్చారు.అందరూఆనందంతో ఉత్సాహంతో శోభాయాత్రలో పాల్గొన్నారు.
నిమజ్జోత్సవంలో అపశృతి ః ఒకరికి గాయాలు
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి) : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ పెద్ద చెరువు వద్ద శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన నిమజ్జన కార్యక్రమంలో అపశృతి జరిగి ఓ యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. గత రెండు రోజులుగా వినాయక నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి పెద్ద చెరువు వద్దకు నిమజ్జనానికి బయలుదేరిన గణనాధుని పట్టణ పురవీధుల నుండి భాజా భజంత్రీలతో యువత కేరింతల కొడుతూ శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు చెరువు వద్ద చేరుకుంది.
అక్కడ ఏర్పాటు చేసిన ఒకే ఒక్క క్రేన్ ద్వారా భారీ సైజులో ఉన్న గణనాధుని విగ్రహాన్ని ట్రాక్టర్ పై నుండి చెరువులోకి దింపుతుండగా ప్రమాదవశాత్తు క్రేన్ వైర్లు జారీ ట్రాక్టర్ మీద పడి విరిగింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ మీద ఉన్న పశునాది మోహన్ అనే యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరగడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని భక్తుల ఆరోపిస్తున్నారు. నాలుగు క్రేన్లు ఏర్పాటు చేశామని ప్రచారం చేసి ఒకే ఒక్క క్రేన్ ఏర్పాటు చేశారని భక్తుల ఆరోపిస్తున్నారు.
గణేష్ నిమజ్జనోత్సవ ఘాట్‌ను పరిశీలించిన ఏసీపీ
వలిగొండ, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని స్థానిక చెరువు వద్ద ఏర్పాటుచేసిన గణేష్ నిమజ్జనోత్సవ ఘాట్ ను చౌటుప్పల్ ఏసిపి మధుసూదన్ రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ రాత్రి వేళల్లో నిమజ్జనోత్సవం నిర్వహించే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా విద్యుత్ దీపాలను పర్యవేక్షించాలని, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ ఐ యుగేందర్ గౌడ్, కార్యదర్శి నాగరాజు, బిల్ కలెక్టర్ బాబు,రెవెన్యూ, పోలీస్, పంచాయతీ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
మల్లెల ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం...
ఆలేరు, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): ఆలేరు పట్టణం రామ్ శివాజీ నగర్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని మల్లెల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మల్లెల శ్రీకాంత్ చేశారు.
ఇట్టి సందర్భంగా మల్లెల శ్రీకాంత్ మాట్లాడుతూ మా తాతగారు మల్లెల బీరప్ప నాకు చెప్పిన విషయంలో ప్రతి ఒక్కటి గుర్తు ఉన్నది అన్నదానం అన్నం పరబ్రహ్మస్వరూపం అని ఏ దానం ఇచ్చిన ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది, తృప్తి పరచకపోవచ్చు కానీ అన్నదానం తీసుకున్న వారు ఇక చాలు అని తృప్తిగా లేస్తారు అని మా తాతగారు చెప్పారు.
ఇట్టి కార్యక్రమంలో ఎలుగల ఆంజనేయులు, చిరిగి శ్రీనివాస్, మైదం ఆంజనేయులు, విగ్రహ దాత మల్లెల ఇస్తారి, చిమ్మి ఆంజనేయులు, ఆనంద్, పత్తి వెంకటేష్, ఆలేటి రమేష్, బోడ మహేష్, సీసా వెంకటేష్, ప్రవీణ్, ఎగ్గిడి భాస్కర్, బోడపట్ల సిద్దులు, ఆలేరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎజాజ్, బోడపట్ల రాజు, శ్రీశైలం, మొరిగాడి వెంకటేష్, మైదం భాస్కర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
హాలియాలో..
హాలియా సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): నియోజకవర్గ వ్యాప్తంగా వీధి వీధినా విఘ్నేశ్వరుని , గల్లి గల్లిన గణనాథులని ప్రతిష్టించుకుని. భక్తిశ్రద్ధలతో నవరాత్రులు పూజలు నిర్వహించుకోని ప్రజలంతా సుఖ సంతోషాలు. సౌభాగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు , చేసే ప్రతి పనిలో మంచి జరగాలని, విద్యా, వ్యాపారం, ఉద్యోగం, కలిసి రావాలని. విఘ్నేశ్వరునీ వేడుకున్నారు.
నవరాత్రులు పూజలు అందుకున్న విఘ్నేశ్వరుడికి నేడు శుక్రవారం అంగరంగ వైభవంగా పిల్లా పాపలతో కుటుంబ సమేతంగా గల్లీలో వీధుల్లో ప్రజలంతా ఒకటై వీడ్కోలుపలికారు హాలియా ఆర్యవైశ్య సంఘం కిరాణం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద లడ్డు పాట 6125o రూపాయలకు. చిట్టిపూలు బాలాజీ కుటుంబ సభ్యులు దక్కించుకున్నారు సాయి మందిరంలో 20 వేల రూపాయలకు పోలిశెట్టి యాదయ్యకు కుటుంబ సభ్యులు దక్కించుకున్నారు.
ఎటుచూసినా ,ఎక్కడ విన్నా గణేష మహారాజ్ కి జై గణపతి పప్పా మోరియా నామస్మరణలతో మారుమోగయి. మహిళలు కోలాటాలతో, చప్పట్లతో. బతుకమ్మ ఆటపాటలతో ఉత్సాహంగా ఊరేగింపు చేశారు. డీజే పాటలు.. బ్యాండ్ చప్పుళ్లు.. తీన్మార్ స్టెప్పుల నడుమ గణనాధుని నిమజ్జన శోభాయాత్రలు ఘనంగా నిర్వహించారు. 14 మేలు వద్ద ఎడమ కాలువలో గణనాథుని గంగమ్మ చెంతకు చేర్చారు.
అందరూఆనందంతో ఉత్సాహంతో శోభాయాత్రలో పాల్గొన్నారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చిట్టిపోలు యాదగిరి హాలియా కిరాణం అసోసియేషన్ చిట్టిపోలు శ్రీనివాసులు గౌరవ అధ్యక్షులు చిట్పూలు వెంకటేశ్వర్లు వీరమళ్ళ కృష్ణయ్యఆర్యవైశ్య సంఘం సీనియర్ నాయకులు చీదళ్ళ లింగయ్య వీరమల్ల కృష్ణయ్య సాయిబాబా గుడి చైర్మన్ తెలపోలు శేఖర్ కొండూరు వెంకటేశ్వర్లు ఊర వేణు కొండూరు గణేషు బచ్చు వెంకన్న మంచుకొండ ప్రభాకర్ సక్రు నాయక్ శివకుమార్ పుట్టు ముత్తు వెంకన్న పుట్టుముత్తు గంగాధర మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి పూజలు
వలిగొండ, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి) : వలిగొండ మండల కేంద్రంలో వివిధ కాలనీలలో ఏర్పాటుచేసిన గణేశుడు మండపాల వద్ద భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను అన్ని వర్గాల ప్రజలు కలిసి మెలిసి ఆనంద ఉత్సవాలతో నిర్వహించుకుంటారని అన్నారు.
వై.ఎస్.సి.ఏ యువజన సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
విగ్నేశ్వరుని లడ్డూ ప్రసాదం కైవసం ..
చండూరు, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి) : మర్రిగూడ మండల పరిధిలోని కుదబాక్ష పల్లి గ్రామానికి చెందిన మర్రిగూడ మాజీ ఎంపీపీ అనంతరాజు గౌడ్ హైదరాబాదులోని మన్నెగూడ లోని పగోడా ప్లాజా అసోసియేషన్ విగ్నేశ్వరుని లడ్డు ప్రసాదాన్ని రూ. 4,11,116 వేల రూపాయలకు వేలం పాటలో పాల్గొని ఆయన కైవసం చేసుకున్నారు.
లడ్డును కైవసం చేసుకున్న అనంతరాజును బ్రాహ్మణులు, కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణులు, కమిటీ సభ్యులు మాట్లాడుతూ, వీరి కుటుంబానికి అన్ని విధాలుగా ఆ భగవంతుడు తోడుగా ఉండాలని, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వినాయకుని ప్రార్థిస్తూ ఆయనకు ఆ లడ్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.