06-09-2025 12:00:00 AM
- మైక్రో బ్రివరీ ల ఏర్పాటుకై దరఖాస్తులు స్వీకరణ
- ఎక్సైజ్ డిప్యూటి కమీషనర్ విజయ భాస్కర్ రెడ్డి
మహబూబ్నగర్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో మైక్రో బ్రివరీ ల ఏర్పాటు చేసేందుకు ఆసక్తి గల వారి నుంచి తెలంగాణ అబ్కారీ శాఖ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. మైక్రో బ్రివరీ ఏర్పాటుకు (1000) చదరపు మీటర్ల తో కూడిన ప్రాంగణం అవసరం ఉంటుందని,మైక్రో బ్రివరి ల ద్వారా బీరును అక్కడికక్కడే తయారు చేసి విక్రయించేందుకు అవకాశం ఉంటుందన్నారు.
ఆసక్తి గల అభ్యర్ధులు దరభాస్తు తో పాటు రూ 1లక్ష చలాన్ ఆదార్ కార్డు నకలు , హోటల్,రెస్టారెంట్,బార్,క్లబ్ లైసెన్స్ నకలు ఉంటే జత చేసి ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు మహబూబ్ నగర్ లోని ఎనుగొండ లోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎక్సైజ్ డిప్యూటి కమీషనర్ కార్యాలయం నందు అందించాలని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఎవరికైనా సందేహాలుంటే పై కార్యాలయంను,87126 58872 నెంబర్ లో గాని సంప్రదించవచ్చని తెలిపారు. దరభాస్తు చేసుకున్న వారికి ఎక్సైజ్ శాఖ కమీషనర్ ప్రయర్ క్లియరెన్స్ జారీచేస్తారని పేర్కొన్నారు. అనుమతులు దక్కించుకున్న వారు 180 రోజుల లోపు మైక్రో బ్రివరి ఏర్పాటు చేయవలసి ఉంటుందన్నారు.