జనగణన షురూ
- తొలి విడత ఆన్‌లైన్‌లో స్వీయ గణన చేసుకున్న గవర్నర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి
- జన గణనలో కులగణన తొలిసారి: కిషన్‌రెడ్డి
- ప్రజలందరు భాగస్వాములు కావాలి : రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో 2027 జనా భా లెక్కల (సెన్సస్) తొలి విడత ప్రక్రియ ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రథమ పౌరుడైన గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో ఆన్‌లైన్‌లో విధానంలో తన వివరాలను నమోదు చేసుకోవడం ద్వారా ఈ కా ర్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గవర్నర్‌తో పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అధి కారుల సమక్షంలో సెల్ఫ్ ఎన్యూమరేషన్’ (స్వీయ గణన) ద్వారా తన జనాభా లెక్కల వివరాలను నమోదు చేసుకున్నారు.
ఈ సం దర్భంగా ప్రజలకు గవర్నర్ పిలుపునిచ్చా రు. పౌరులంతా తమ కుటుంబ వివరాలను సెల్ఫ్‌ఎన్యూమరేషన్ విధానంలో నమోదు చేసుకోవాలని గవర్నర్ కోరారు. కచ్చితమైన, సమగ్రమైన జనాభా లెక్కల కోసం ప్రతి కుటుంబం భాగస్వామ్యం అత్యంత కీలకమని, ఏ ఒక్క ఇల్లూ లెక్కల్లోంచి తప్పిపోకూ డదని గవర్నర్ స్పష్టం చేశారు. జనాభా లెక్కల సేకరణ ప్రజాస్వామ్యంలో గొప్ప కార్యక్రమం అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.
జన గణనలో భాగంగా ఆదివారం ఆయన స్వీయ ధ్రువీకరణ చేసుకున్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ జనగణనలో తొలిసారి కుల గణన జరుగుతోందన్నారు. వివరాలు చెప్పితే సంక్షేమ పథకాలు తొలగిస్తారనే భయం వద్దని, అం దరూ ధైర్యంతో వివరాలు ఇవ్వాలని కోరా రు. ఎన్నికల కమిషన్ చేపట్టిన ఎస్‌ఐఆర్‌ను అభినందించాలని, దీనివల్ల నకిలీ ఓట్లు తగ్గించవచ్చన్నారు. నకిలీ ఓట్ల తొలగింపుతో పోలింగ్ పర్సంటేజ్ పెరిగిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో పోలింగ్ శాతం 50 శాతం దాటడం లేదని, ఎస్‌ఐఆర్ పూర్తయితే ఇక్కడ కూడా పోలింగ్ శాతం పెరుగుతుందని కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ పర్యటనకు రానున్న ప్రధాని మోదీ .. రైల్వే, జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభిస్తారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఆదివారం జూబ్లీహిల్స్‌లో సెల్ఫ్ ఎమ్యునరేషన్ కార్యక్రమంలో భాగంగా వెబ్‌సైట్ ద్వారా తన వివరాలను నమోదు చేసుకున్నారు.
ఈ సె ల్ఫ్ ఎమ్యునరేషన్‌లో ప్రజలందరు భాగస్వామ్యులు కావాలని సీఎం పిలుపునిచ్చారు. అంతకు ముందు అధికారులు సెల్ఫ్ ఎమ్యునరేషన్ కార్యక్రమంపై సీఎం రేవంత్‌రెడ్డికి అధికారులు వివరించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ స్వీయ గణన ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపేలా ప్రజలందరూ ముందుకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.
2027 సెన్సస్ కోసం ప్రభుత్వం కల్పిస్తున్న ఈ ఆన్‌లైన్ సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని, దేశ ప్రగతికి తో డ్పడే ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అధికారులు సైతం విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సెన్సస్ ఆపరేషన్ డైరెక్టర్ భారతి హేలికేరి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, జాయింట్ ప్రిన్సిపల్ సెన్షన్ అధికారిణి ప్రియాంక అల, ఐఅండ్ పీఆర్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






