25 April, 2026 | 2:14 PM

Breaking News

Telangana Census 2026: మే 11 నుంచి ప్రతి ఇంటికి మార్కు

25-04-2026 12:31 PM

హైదరాబాద్: జనగణన తెలంగాణ డైరెక్టర్ భారతి హొలికేరి(Bharathi Hollikeri) శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో జనాభా లెక్కల సేకరణ వివరాలను వెల్లడించారు. ఆస్పత్రి బడి, గుడి, గుడిసె, అద్దె భవనం ఏదైనా గణన జరుగుతోందని చెప్పారు. తెలంగాణ భౌగోళిక పరిధిలో ఉన్న ప్రతి ఇల్లు గణన ఉంటుందని సూచించారు. భవనంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని పరిగణలోకి తీసుకుంటామని వివరించారు.

2027 ఫిబ్రవరిలో రెండో దశ మొదలయ్యేలోగా అంతా సిద్ధంగా చేస్తామని భారతి హొలికేరి వెల్లడించారు. 2027 ఫిబ్రవరి నుంచి రెండో దశలో వ్యక్తిగత సమాచారం సేకరిస్తామన్నారు. ఇళ్ల గణన కోసం బ్లాకులుగా విభజించి ఎన్యుమరేటర్లను కేటాయిస్తామని తెలిపారు. మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి మార్కు చేస్తారని జనగణన తెలంగాణ డైరెక్టర్ వెల్లడించారు. ప్రతి భవనంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయనేది మార్కు చేస్తారని సూచించారు.