టీ-ఫైబర్ విస్తరణకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
- భారత్‌నెట్‌కు రూ.3,185 కోట్ల ఆమోదం
- రాష్ట్రంలో త్వరలో 3,089 గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాం తి): తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలకు వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం సవరించిన భారత్‌నెట్ కార్యక్రమం కింద తెలంగాణకు రూ.3,185 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఈ నిధులతో భారత్‌నెట్ ఫేజ్-1, ఫేజ్-2 పనులను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు ఫేజ్-3 విస్తరణ చేపట్టనున్నారు.
ప్రాజెక్టు అమలుకు ప్రత్యేకంగా ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసిన తర్వాత నిధులు విడుదల కానున్నాయి. ఈ ఆమోదంతో టీఫైబర్ సేవలను ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని 3,089 గ్రామాలకు విస్తరించనున్నారు. ప్రస్తుతం టీ-ఫైబర్ ద్వారా తెలంగాణలో 9,662 గ్రామాలకు సేవలు అందించే సామర్థ్యం ఉంది. మొత్తం రూ.3,185 కోట్లలో రూ.2,697 కోట్లు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ కేబులింగ్ పనులు, నిర్వహణకు వినియోగించనున్నారు.
రూ.432 కోట్లు ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లా ల్లో కేబుల్ మౌలిక వసతుల బలోపేతానికి కేటాయించారు. భారత్‌నెట్ ఫేజ్2లో ఇప్పటికే టీ-ఫైబర్ ద్వారా సుమా రు 42 వేల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్ 9,662 గ్రామాల్లో వేశారు. వీటిలో 8,835 గ్రామాల్లో సేవలు ప్రారంభించేందుకు సాంకేతికంగా సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 3,000 మందికి పైగా జనాభా ఉన్న గ్రామాల్లో ఒక్క కనెక్షన్‌కు రూ.8,900, 2,000 నుంచి 3,000 మధ్య జనాభా ఉన్న గ్రామాల్లో రూ.10,500, 1,000 నుంచి 2,000 మధ్య జనాభా ఉన్న గ్రామాల్లో రూ.11,500, 1,000 కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో రూ.12,900గా నిర్ణయించారు.
ఈ ఆమోదం రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిరంతర ప్రయత్నాల ఫలితంగా లభించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వం లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సమన్వయం చేసుకుంది. ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు కేంద్రంతో చర్చలు జరిపి ప్రాజెక్టు ఆమోదం కోసం కృషి చేశారు. కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో సమావేశమై సహకారం కోరారు.




