దళిత ఉప సర్పంచుపై వివక్ష
- తన కుర్చీ పక్కన కుర్చీ వేసుకోవద్దన్న మహిళా సర్పంచ్
- సర్పంచుకే వత్తాసు పలికిన డీఎల్పీవో సురేందర్
- కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గండివేట్‌లో ఘటన
- దళిత సంఘాల ఆందోళన..
కామారెడ్డి, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గండిపేట్ గ్రామంలో దళిత ఉప సర్పంచుపై బీసీ మహిళా సర్పంచ్ కుల వివక్ష ప్రదర్శించడం దళిత సంఘాల్లో ఆగ్రహాన్ని తెప్పించింది. సర్పంచుగా బీసీ మహిళ అనూష- సంతోష్, ఉప సర్పంచుగా ఎస్సీ అయిన కిష్టాపురం కాశీ రాం ఎన్నికయ్యారు. అయితే ‘దళితుడివైన నువ్వు నా పక్కన కూర్చోవద్దు,
ఉపసర్పంచ్ కుర్చీ నా కుర్చీ పక్కన ఉండరాదు’ అని సర్పం చ్ వివక్ష చూపడంతో కాశీరాం జిల్లా అధికారులకు తెలిపారు. ఈ విషయమై డీఎల్పీవో సురేందర్.. సర్పంచ్ పక్కన కుర్చీని వెంటనే తీసివేయాలని లేదంటే పద్ధతిగా ఉండదని కాశీరాంను ఫోన్‌లో హెచ్చరించడం గమనా ర్హం. దీంతో కాశీరాం ఈ విషయాన్ని దళిత సం ఘాల నాయకులకు తెలిపారు.
కామారెడ్డి జిల్లాలోని దళిత సంఘాల నాయకులు ఆ గ్రా మానికి చేరుకొని మంగళవారం పంచాయతీ ఆఫీసు ఎదుట టెంట్ వేసి బైఠాయించారు. కుల వివక్ష చూపడం సరికాదని, సర్పంచ్ క్షమాపణ చెప్పాలని లేదంటే కలెక్టరేట్ ఎదుట టెంట్ వేసి ధర్నా చేస్తామని, అక్కడ కూడా న్యాయం జరగకపోతే హెచ్‌ఆర్సీని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. డీఎల్పీవో సురేందర్‌పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాం డ్ చేశారు. కార్యక్రమంలో దళిత సంఘాల నా యకులు, మాజీ సర్పంచ్ ఫారూక్, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు ఎర్రవట్టి సాయిబా బా, ఎమ్మార్పీఎస్ నాయకులు రుషే గాం భూ మయ్య, డాకయ్య, సంజీవులు పాల్గొన్నారు.




