రాష్ట్రానికి రూ.5,681 కోట్లు
- యూసీఎఫ్ నిధులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
- మూడు ప్రతిపాదనలకూ అపెక్స్ కమిటీ ఆమోదం
- వరంగల్‌కు రూ.4,674 కోట్లు, కరీంనగర్‌కు రూ.840 కోట్లు
- ఖమ్మం-కరీంనగర్ కారిడార్ డిజిటల్ గవర్నెన్స్‌కు రూ.166 కోట్లు
- పట్టుపట్టి సాధించుకున్న కేంద్రమంత్రి బండి సంజయ్
హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి): యూసీఎఫ్ నిధుల కింద రాష్ట్రానికి రూ.5, 681 కోట్లు ఇవ్వడానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం పంపిన మూడు ప్రతిపాదనలకూ అపెక్స్ కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో వరంగల్‌కు రూ.4,674 కోట్లు, కరీంనగర్‌కు రూ.840 కోట్లు, ఖమ్మం-కరీంనగర్ కారిడార్ డిజిటల్ గవర్నెన్స్‌కు రూ.166 కోట్లు రానున్నా యి. ఈ యూసీఎఫ్ నిధుల్లో కేంద్ర, రాష్ట్రాల వాటా 50 శాతం ఉండగా, మిగిలిన 50 శాతం హడ్కో రుణం ద్వారా సేకరించుకోవాలని తెలిపింది.
తొలుత యూసీఎఫ్ జాబి తాలోనే లేని కరీంనగర్‌ను ఎట్టిపరిస్థితుల్లో చేర్చాలని కేంద్రమంత్రి బండి సంజయ్ పట్టుపట్టి సాధించుకున్నారు. ఇక రూ.840 కోట్లతో కరీంనగర్‌లో అభివృద్ధి పరుగులు పెట్టనుంది. మోడల్ రోడ్లు, స్కైవాక్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు.. జంక్షన్లను అత్యాధునికంగా నిర్మించనుండడంతో కరీంనగర్ రూపురేఖలే మారనున్నాయి. తెలంగాణ, ఏపీ సహా దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాలు యూసీఎఫ్ కింద 17 ప్రాజెక్టుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయి.
ఈప్రాజెక్టుల విలువ మొత్తం రూ.14,867.88 కోట్లు. వీటికి కేంద్రం ఆమోదం తెలిపింది. తెలంగాణ విషయానికొస్తే మూడు ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభు త్వం పంపగా వాటికి ఆమోదం తెలిపింది. వీటిలో ఒకటి ఖమ్మం-- వరంగల్-- కరీంనగర్ కారిడార్, రెండోది వరంగల్ మురుగునీ టి ఆధునికీకరణ, మూడోది కరీంనగర్ మో డల్ రోడ్లు, స్కై వాక్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్ పోర్ట్ (మోటార్, ఇంధనం ఉపయోగించే రవాణా వాహనాలు) వంటి వి ఉన్నాయి.
ఈ మూడు ప్రాజెక్టుల విలువ మొత్తం రూ.5681.04 కోట్లు. ఇందులో కేం ద్రం 25 శాతం నిధులను ఇవ్వనుంది. అం దులో భాగంగా రూ.1,420.26 కోట్లను వి డుదల చేసింది. వీటిలో రాష్ట్ర ప్రభుత్వం సై తం తన వాటాగా 25 శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా, మిగిలిన మొత్తాన్ని హడ్కో రుణం రూపంలో కేంద్రం నిధులను సమకూర్చనుంది. ఈ మేరకు కేంద్ర పట్టణాభివ్రుద్ధి మంత్రిత్వశాఖ కార్యదర్శి హీరాలాల్ మిశ్రా నుంచి తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అందింది.
తొలుత రాష్ట్ర ప్రభుత్వం పం పిన యూసీఎఫ్ ప్రతిపాదనల జాబితాలో కరీంనగర్ లేదు. వరంగల్ కార్పొరేషన్ ప్రతిపాదనలను మాత్రమే యూసీఎఫ్ స్కీంలో చేర్చారు. ఖమ్మం-, వరంగల్-, కరీంనగర్ కారిడార్‌ను కూడా ఈ స్కీంలో చేర్చారు. అం దులో భాగంగా ఆయా ప్రతిపాదనలకు సం బంధించి డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను కూడా కేంద్రానికి పంపారు. ఈ విష యం తెలుసుకున్న కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్‌కుమార్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను సైతం యూ సీఎఫ్ జాబితాలో చేర్చాల్సిందేనని పట్టుపట్టారు.
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కరీంనగర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న వెంటనే కరీంనగర్ అభివృద్ధి, ఆధునికీ కరణలో భాగంగా చేపట్టాల్సిన అభివృద్ధి కా ర్యక్రమాలకు సంబంధించి ఆగమేఘాల మీద ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి పంపారు. ఇదే అంశంపై ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ ను కలిసి ఈ ప్రతిపాదనలను ఆమోదించాలని కోరారు.
పలుమార్లు కేంద్ర పట్ట ణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతోనూ చ ర్చించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కరీంనగర్ ప్రతిపాదనలను ఆమోదించాలంటూ పట్టుపట్టారు. బండి సంజయ్ పట్టుదల నేపథ్యం లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ నుంచి వచ్చిన 3 ప్రతిపాదనలకు యూసీఎఫ్ నేషనల్ అపెక్స్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు నిధుల వరద రానుంది. యూసీఎఫ్ స్కీం ద్వారా రానున్న రూ.840 కోట్ల నిధులతో కరీంనగర్‌లో స్కైవాక్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, మోడల్‌రోడ్లను నిర్మించనున్నారు.






