30 May, 2026 | 2:47 AM

సెంట్రింగ్ కార్మికుల సమ్మె విరమణ

30-05-2026 12:19 AM

న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటం

ముషీరాబాద్, మే 29 (విజయక్రాంతి): సెంట్రింగ్ కార్మికుల సమ్మెను విరమిస్తున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు వెల్లడించారు. సెంట్రింగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా వారు ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం బాగ్ లింగం పల్లి  సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సెంట్రింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు పి. కృష్ణ, చైర్మన్ ఎస్. పరశురాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి చాంద్ పాషా ఆకుల ప్రవీణ్ మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లలో ఒకటైన స్క్వేర్ ఫీట్ కు 51 బిల్డర్స్ అసోసియేషన్ తమకు ఆమోదం తెలిపిందని తెలిపారు. ఇతర చిన్న చిన్న సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. అదే విధంగా తమ న్యాయమైన సమస్యలను శాసనసభ సమావేశాల్లో చర్చించాలని ఎమ్మెల్యేలను కోరారు. వలస కార్మికులకు కార్మిక శాఖ నుండి గుర్తింపు కార్డుల మంజూరుకి కార్మిక శాఖ కమిషనర్ ప్రకటించినట్లు వారు తెలిపారు.

తమ సమ్మెకు మద్దతు తెలిపిన సెంట్రింగ్ కాంట్రాక్టు కార్మికులకు మేస్త్రీలకు, అసోసియేషన్ సంఘాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదే పోరాటస్ఫూర్తితో శాంతియుతంగా సామరస్యంగా మిగతా డిమాండ్లను సాధించుకుంటామని వారు వెల్లడించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి ఆకుల ప్రవీణ్ కుమార్, కోశాధికారి విష్ణువర్ధన్ రెడ్డి,  ఉపాధ్యక్షుడు ఎన్.  శ్రీనివాస్ రెడ్డి,  ఆర్గనైజింగ్ సెక్రటరీ కమలాకర్ రాజు గౌడ్, మహమ్మద్ అహమ్మద్,బోరబండ మక్సుద్ తదితరులు పాల్గొన్నారు.