26 April, 2026 | 6:25 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం

26-04-2026 04:51 PM

DYFI ఖమ్మం డివిజన్ కార్యదర్శి, రావులపాటి నాగరాజు

రఘునాథపాలెం,(విజయక్రాంతి): ఖమ్మం డివిజన్ ఆదివారం స్థానిక సుందరయ్య భవనంలో డీవైఎఫ్ఐ డివిజన్ కమిటీ సమావేశం, DYFI ఖమ్మం డివిజన్ అధ్యక్షులు కూచిపూడి నరేష్ అధ్యక్షతన, జరిగిన ఖమ్మం డివిజన్ కమిటీ సమావేశంలో  డీవైఎఫ్ఐ (DYFI) ఖమ్మం డివిజన్ కార్యదర్శి, రావులపాటి నాగరాజు మాట్లాడుతూ, ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా నిరుద్యోగులను బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు మోసం చేస్తోందని అన్నారు. ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని, అదేవిధంగా తక్షణమే ప్రభుత్వం ప్రకటించిన విధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలి.

ఎన్నికల హామీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏడాదిలో రెండు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన ప్రభుత్వాలు, ఆ దిశగా అడుగులు వేయడం లేదు. ఇప్పటివరకు కేవలం పాత నోటిఫికేషన్లకు నియామక పత్రాలు అందించారు తప్ప, కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా వేయలేదు. హైదరాబాద్ నగరంలో 'యూత్ డిక్లరేషన్' ప్రకటించి, దానిని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. అలాగే సమావేశంలో DYFI ఖమ్మం డివిజన్ అధ్యక్షులు కూచిపూడి నరేష్, మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే, జిల్లా వ్యాప్తంగా డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.