సెంట్రల్ బ్యాంక్‌కు తొలి రాజభాషా కీర్తి పురస్కారం

17-09-2026 | 05:15am

అధికారిక భాష హిందీ అమలుకు గాను అవార్డు

విజయవాడ, సెప్టెంబర్ 16: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Central Bank of India)కు అధికారిక భాష హిందీ అమలులో అత్యుత్తమ కృషికి గాను తొలి రాజభాషా కీర్తి పురస్కారం లభించిం ది. భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన రాజభాషా విభాగం ఆధ్వర్యంలో సోమ, మంగళవారాల్లో నవీ ముంబైలో నిర్వహించిన అఖిల భారత రాజభాషా సదస్సులో ఈ ప్రతిష్ఠాత్మక పురస్కా రం బ్యాంకుకు ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా ప్రథమ బహుమతిగా అందజేసిన రాజభాషా షీల్డ్‌ను(Official Language Shield) బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ కల్యాణ్ కుమార్ కేంద్ర హోం వ్యవహారాలు, సహకార శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) చేతుల మీదుగా స్వీకరించారు. అధికారిక భాషా విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, హిందీ భాషను ప్రోత్సహించడం,ప్రచారం చేయడం, అలాగే అధికారిక భాషా విధానానికి బ్యాంకు చూపుతు న్న నిరంతర నిబద్ధతకు ఈ పురస్కారం గు ర్తింపుగా నిలుస్తుంది.

ఈ సందర్భంగా బ్యాంకు ద్విభాషా అంతర్గత పత్రిక ‘సెంట్రలైట్(CentraLite)’ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన ‘హెరిటేజ్ ఎడిషన్(Heritage Edition)’ ను కూడా ఆవిష్కరించారు. అదేవిధంగా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 115 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రస్థానాన్ని ప్రతిబింబించే ప్రత్యేక ప్రదర్శనను బ్యాంకు ఏర్పాటు చేసింది.

ఈ ప్రదర్శనలో బ్యాంకు వారసత్వం, నూతన ఆవిష్కరణ కార్యక్రమాలు, అధికారిక భాషా రంగంలో సాధించిన విజయాలు, అలాగే బ్యాంకు అభివృద్ధి ప్రస్థానాన్ని వివిధ నమూనాలు, ప్రద ర్శనల ద్వారా ఆవిష్కరించారు. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక భాష అమలు, హిందీ భాష ప్రోత్సాహంలో చేస్తున్న నిరంతర కృషికి లభించిన గౌరవప్రదమైన గుర్తింపుగా నిలిచింది.

మరిన్ని వార్తలు