పేద ప్రజల పాలిట వరంగా ముఖ్యమంత్రి సహాయనిధి
12-07-2026 04:32 PM
* లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన సర్పంచ్ శ్రీధర్
పాపన్నపేట: పేద ప్రజల పాలిట వరంగా ముఖ్యమంత్రి సహాయనిధి తోడ్పాటునందిస్తుందని కుర్తివాడ గ్రామ సర్పంచ్ చెట్టుకింది శ్రీధర్ పేర్కొన్నారు. సోమవారం గ్రామంలో ముగ్గురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చెక్కులు అందజేశారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరుపేదలకు వైద్య విషయంలో అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం మూడవ వార్డులో నూతన బోరు మోటారు బిగించి ప్రజల నీటి సమస్యను తీర్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజలు ఉన్నారు.






