సీఎం రేవంత్ రెడ్డితో భేటీ.. స్పందించిన చంద్రబాబు
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడటమే తన విధానమని చంద్రబాబు తెలిపారు. రెండింటికీ సమన్యాయం చేయాలని విభజన వేళ కూడా చెప్పానని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం రేవంత్ రెడ్డితో చర్చిస్తానని స్పష్టం చేశారు.
తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడుల మధ్య కీలక భేటీకి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. విభజన సమస్యల పరిష్కారానికి సమావేశం కావాలని చంద్రబాబు నాయుడు రాసిన లేఖపై రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. సమావేశంలో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎజెండాను సిద్ధం చేస్తోంది. జులై 6న జరిగే సభకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు సమాచారం. ఈ విషయమై సహచర మంత్రులు, ఉన్నతాధికారులతో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు.






