16 June, 2026 | 6:36 PM

జూడాల నిరసనలపై కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు

18-08-2024 03:34 PM

న్యూఢిల్లీ: కోల్ కతా వైద్యురాలి అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరసనల కొనసాగిస్తున్నారు. ఈ నిరసనల దృష్ట్యా కేంద్ర హోంశాఖ ఆదివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలో శాంతి భద్రతలపై 2 గంటలకోసారి నివేదించాలని రాష్ట్రాలకు ఆదేశించింది. రాష్ట్రాల్లోని పోలీసు ఉన్నతాధికారులు మెయిల్, వాట్సాప్, ఫ్యాక్స్ ద్వారా నివేదికలు పంపాలని సమాచారం ఇవ్వాలని కేంద్రం వెల్లడించింది. నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్న కేంద్ర హోంశాఖ పేర్కొంది.