రైతు రుణమాఫీపై ఖర్గే, రాహుల్ కు లేఖ రాసిన కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ రైతుల పంట రుణమాఫీపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలోని రైతలను కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పేరుతుతో మోసం చేసిందని, రైతులందరికీ రుణమాఫీ చేయాలని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు.
రుణమాఫీ అందని లక్షలాది మంది రైతుల తరపున లేఖ రాస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న లెక్కలకు, క్షేత్రస్థాయి వాస్తమాలకు మధ్య తేడా ఉందని, వరంగల్ రైతు డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతుల పంటల రుణాలను 2 లక్షల వకు మాఫీ చస్తామని హామీ ఇచ్చారన్నారు.
రాష్ట్రంలో 40 శాతం మందికి మాత్రమే రుణమాఫీ చేశారని, రూ.40 వేల కోట్ల రుణమాఫీ అని చెప్పి కేవలం రూ.17 వేల కోట్లే రుణమాఫీ చేశారని కేటీఆర్ చెప్పారు. రుణమాఫీ పూర్తి చేయకుండా రైతులను నట్టేల ముంచారని, రుణమాఫీ కాని రైతుల తరపున బీఆర్ఎస్ పోరాడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.






