16 June, 2026 | 7:05 PM

ఘనంగా ఖానాపూర్ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు

16-06-2026 06:29 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు ఖానాపూర్ పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు ఖానాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పట్టణంలో ముందు తెలంగాణ చౌక్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ మండలాల నాయకులను కలిశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జంగిలి శంకర్ ,పట్టణ అధ్యక్షులు గొర్రె గంగాధర్ ,డిసిసి ఉపాధ్యక్షులు రాజుర సత్యం, నిమ్మల రమేష్, యూసుఫ్ ఖాన్ ,ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.