16 June, 2026 | 7:04 PM

కరెంట్ కటింగ్.. ఉక్కపోతతో.. ప్రజల కష్టాలు.

16-06-2026 06:31 PM

రోజుకో పదిసార్లు పైన పోతున్న వైనం

అధికారులు ఉన్నట్లా, లేనట్లా అని ప్రజల ఆగ్రహం

తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అవసరాల కోసం 24 గంటలు కరెంటు ఇస్తామని, వాగ్దానాలు చేసినప్పటికీ మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు చందంగా, ఎండాకాలం ముగిసి వానాకాలంలో ప్రవేశించినప్పటి నుండి ప్రతిరోజు నిత్యం సుమారు పదిసార్లు పైగా కరెంటు రావడం, పోవడంతో ఒక ప్రక్క ఎలక్ట్రిక్ సామాన్లు కాలిపోతుండడం, గ్రామాల్లో ఒక్కొక్క కరెంటు పోల్కు అత్యధికంగా ఇంటి లైన్లు లైన్లు ఉండడంతో ఒకదానికొకటి తాక్కొని, వైర్లు మండుతూ కింద పడుతున్నాయి.

 మరొక ప్రక్క ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేమిటని  కరెంట్ అధికారులను ప్రశ్నించగా, బ్రేక్ డౌన్ అవుతుంది, మేమేం చేయాలి, మాకు తెలవదా, మేమెందుకు కట్ చేస్తాం, అని వితండవాదం వేస్తూ, ఫోన్లో సర్ది పెడుతున్నారు. ఏది ఏమైనా జిల్లా కరెంటు ఉన్నతాధికారులు, తక్షణమే జరుగుతున్న సంఘటనల పట్ల, ఎప్పటికప్పుడు విద్యుత్తు లైన్లకు మరమ్మత్తులు చేసి, అంతరాయం కలగకుండా విద్యుత్ అందించాలని ప్రజలు కోరుతున్నారు.