29 July, 2026 | 1:16 AM

సెంట్రల్ లైటింగ్ మరో కీలక మైలు రాయి

29-07-2026 12:00 AM
  1. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
  2. రూ.2.65 కోట్లతో నూతన సెంట్రల్ లైటింగ్ ప్రారంభం

వేములవాడ, జులై 28, (విజయ క్రాంతి): వేములవాడ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా, ఆధునిక హంగులతో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. పట్టణంలో రూ.2.65 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు వేములవాడకు ఆధునిక, ఆకర్షణీయమైన రూపు తీసుకురావడమే లక్ష్యం అన్నారు.

నూతన సెంట్రల్ లైటింగ్తో రాత్రివేళల్లో పట్టణం మరింత వెలుగులతో కళకళలాడటంతో పాటు ప్రజలకు భద్రత, మెరుగైన సౌకర్యాలు అందుతాయని అన్నారు.వేములవాడ పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, దశలవారీగా అవసరమైన అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. నూతన సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు వేములవాడ అభివృద్ధి ప్రయాణంలో మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆది శ్రీనివాస్ తెలిపారు.