వరుణ్ మోటార్స్‌లో న్యూ ఎస్‌యూవీ విడుదల
ముఖ్య అతిథిగా నటి అనన్య నాగళ్ల
హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): భారతదేశంలో అగ్రగామికి నిలిచిన మారుతి సుజుకి డీలర్ వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ‘ది న్యూ బ్రెజ్జా టర్బో బూస్టర్జెట్ (ఎస్‌యూవీ)’ కారును బేగంపేట షోరూంలో మంగళవారం విడుదల చేసింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నటి అనన్య నాగళ్ల, మారుతి కమర్షియల్ బిజినెస్ హెడ్ సురేష్ బాబు, మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ రీజినల్ మేనేజర్ జీ పార్థిబన్, వరుణ్ మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీఆర్‌సీ రాజు, సీజీఎం ఎస్ కౌశిక్, జీఎం కే కృష్ణ కుమార్ తదితరులున్నారు. కాగా అత్యధికంగా అమ్ముడవుతున్న కారు ‘ఎస్‌యూవీ’ ప్రత్యేకతలను షోరూం నిర్వాహకులు ప్రత్యేకతలను ఫైవ్ స్టార్ రేటింగ్ లక్ష్యం, బ్లుండ్ స్పాట్ వార్నింగ్, 360 వ్యూ కెమెరా, సార్మ్ ప్రో ఎక్స్, 10.1 అంగుళాల టచ్ స్క్రీన్, సరికొత్త యాక్సెసరీ వివరించారు.






