16 April, 2026 | 12:08 PM

Breaking News

వీధి కుక్కల దాడి.. మృత్యువుతో పోరాడి— 15 రోజుల తర్వాత బాలుడు మృతి   •   కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •  

బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభం..

26-06-2025 07:00 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలీసెట్-2025 కౌన్సెలింగ్ సర్టిఫికేట్ ధృవీకరణ(Certificate Verification) ప్రక్రియ చేపట్టారు. గురువారం పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభమైంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా డిస్ట్రిక్ట్ మొబైల్ సైన్స్ ఫేర్ ఆఫీసర్ (DSO) కె. మధుకర్ ముఖ్య అతిథిగా హాజరై, మొదటి ధృవీకరణ ఫారాన్ని విద్యార్థికి అందజేశారు. విద్యా సేవల్లో తనదైన ముద్ర వేసుకున్నా మధుకర్, గత ఐదు సంవత్సరాలుగా ఆసిఫాబాద్ జిల్లా డీఈఓ ప్రభుత్వ ఉపాధ్యాయుల సహకారంతో పదవ తరగతి విద్యార్థులకు ఉచిత పోలీసెట్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు.

ఈ ఏడాది 200 మందికి శిక్షణ అందించగా, వారిలో 75 మంది విద్యార్థులు POLYCET-2025లో ఉత్తీర్ణులై కౌన్సెలింగ్‌కు హాజరయ్యారనీ తెలిపారు. ఆయన సేవలను గుర్తిస్తూ, పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డా. ఎం. దేవేందర్  ఆధ్వర్యంలో కళాశాల సిబ్బంది మధుకర్ ని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో  ఈఐ శాఖ హెడ్ బీ వెంకటేశ్వర్లు, ఈఈఈ శాఖ హెడ్ ఎస్ నాగరాజు, వర్క్‌షాప్ సూపరింటెండెంట్  డీ రాందాస్, కౌన్సెలింగ్ ఇంచార్జి టీ. మధుకర్  ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.