calender_icon.png 13 July, 2025 | 1:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిబంధనలు పాటించని పాఠశాలపై చర్యలు తీసుకోండి

26-06-2025 06:49:55 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District)లో ప్రభుత్వ నిబంధనలు పాటించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గురువారం డీఈవో కార్యాలయంలో ఏవో నరసయ్యకు వినతిపత్రం అందించారు. కొన్ని అనుమతి లేకుండా నిర్వహించబడుతూ పేద పిల్లల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని పాఠశాలలోనే విద్యార్థి డ్రెస్సులు పుస్తకాలు స్కూలు సామాగ్రి కొనుగోలు చేసేలా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు దినేష్ శివకుమార్ సాయి వంశీ శీను పాల్గొన్నారు.