30 August, 2026 | 11:23 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

విద్యార్థులకు సీఎం చేతులమీదుగా ప్రశంసా పత్రాలు

11-06-2024 02:21 AM

సిద్దిపేట రూరల్, జూన్ 10: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ పదో తరగతి విద్యార్థులు 10 మంది 10 జీపీఏ సాధించి రాష్ట్రంలో మొద టి స్థానంలో నిలిచారు. ఈ మేరకు వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమ వారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో 10 జీపీఏ సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి హాజరై విద్యార్థులకు ప్రశం సా పత్రాలు అందజేశారు. అదేవిధంగా 2024 శ్రేష్ఠ పాఠశాల ప్రతిభ పురస్కారాన్ని ఉపాధ్యాయులకు అందజేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం లక్ష్మయ్య, ఉపాధ్యా యులు వెంకటేశం, నర్సింలు, కనకరాజుతో పాటు ౧౦ జీపీఏ సాధించిన విద్యార్థులు పాల్గొన్నారు.