బైక్‌లు దొంగిలిస్తున్న ముఠా అరెస్ట్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 10 (విజయక్రాంతి) : జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న ముగ్గురు వ్యక్తులను బోయిన్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో నార్త్‌జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. రజాక్ ఖాన్(38), యమ్మల యోహను (30), జీ వెంకటప్పయ్య(28) ము గ్గురు స్నేహితులు. ఈ ముగ్గురూ కలిసి గత కొంతకాలంగా ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్నా రు. నగరంలోని వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో పార్కింగ్ చేసిన 14 ద్విచక్ర వాహనాలను దొంగిలించి, నకిలీ రిజిస్ట్రేషన్లు చేసి ఓఎల్‌ఎక్స్ యాప్ ద్వారా విక్రయిస్తున్నారు. నిందితుల నుంచి రూ. 8 లక్షల విలువైన 14 ద్విచక్ర వాహనాలు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.






