30 August, 2026 | 10:08 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

డీఆర్‌ఎఫ్ ఆధ్వర్యంలో మాన్‌సూన్ ఎమర్జెన్సీ శిక్షణ

11-06-2024 02:22 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 10 (విజయక్రాంతి): నగరంలో కురిసే వర్షాల కారణంగా సంభవించే విపత్తులు, ప్రమాదాల సమయంలో ప్రజలకు సహాయక చర్యలు చేపట్టేందుకు జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థల ప్రతి నిధులకు, పౌరులకు సోమవారం ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రేటర్‌వ్యాప్తంగా 160 మంది పౌరులు పాల్గొని విప త్తుల కాలంలో సహాయక చర్యలు ఎలా చేపట్టాలనే అంశంపై డీఆర్‌ఎఫ్ బృందం ద్వారా మెళకువలు నేర్చుకున్నారు. నాగోల్‌లోని ఫతుల్లాగూడ ట్రైనింగ్ కేంద్రం వద్ద ఈ శిక్షణ నిర్వహించారు.

వర్షాల సమయంలో మూ సీ, నాలాలు ఉప్పొంగి ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగించే విషయం తెలిసిందే. ఈ సమయంలో ఒక్కోసారి ప్రాణనష్టం కూడా సంభవిస్తుంది. అయితే, జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ బృందాలతో పాటు ఆ సమయంలో స్థానికులు కూడా సహాయక చర్యలు, ముం పు ద్వారా వచ్చే ప్రమాదాల నుంచి బయటపడడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు శిక్షణ ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ భా వించింది. ఈ శిక్షణకు 160 మంది హాజరైనట్టుగా స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కే శ్యామ్ సుందర్ రెడ్డి తెలిపారు.