07-06-2025 11:17:59 PM
మహిళా మెడలో తాళిబొట్టు మాయం..
కొత్తగూడెం (విజయక్రాంతి): కొత్తగూడెం పట్టణంలోని 27వ వార్డు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో ఉన్న, బర్లిఫిట్ ఏరియాలో శ్రీపాద పద్మ శనివారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో తన ఇంటి ముందు పరిసరాలను శుభ్రం చేస్తున్న సమయంలో, ఒక గుర్తు తెలియని అగంతకుడు ద్విచక్ర వాహనంపై వచ్చి తన చేతిలో ఉన్న గుడ్డతో, నోరు మూసి మెడలో ఉన్న తాళిబొట్టును ఎత్తుకెళ్లాడు. మహిళా తేరుకొని, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో వన్ టౌన్ పోలీస్ లు దర్యాప్తు చేపట్టి వివరాలు సేకరిస్తున్నారు. దీంతో బర్లిపేట ఏరియాలో మహిళల్లో ఆందోళన, ప్రజల్లో కలకలం చోటుచేసుకుంది.