19 May, 2026 | 6:21 PM

Breaking News

బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై కేసు

22-04-2024 12:35 AM

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రిల్ 20 (విజయక్రాంతి) : హైదరాబాద్ పార్లమెంట్ బీజే పీ అభ్యర్థి కొంపెల్లి మాధవీలతపై బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. శ్రీరామనవమి సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన శోభాయాత్రలో పా ల్గొన్న ఆమె.. బేగంబజార్ మసీదు వద్దకు రాగానే బాణం ఎక్కుపెట్టిన వ్యవహారంపై షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టినందుకు ఐపీసీ 295ఏ సెక్షన్ కింద పోలీసులు  కేసు నమోదు చేశారు. మసీదుపై బాణం ఎక్కుపెట్టినట్లుగా సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఎంఐఎం నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తనపై బురద చల్లడం కోసమే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాధవీలత పేర్కొన్నారు. అది పూర్తి వీడియో కాదన్నారు. ఒకవేళ ఆ వీడియో వలన ఎవరి మనోభావాలైన దెబ్బతిని ఉంటే తనను క్షమించాలని ఒక ప్రకటనలో తెలిపారు. తనను రాజకీయంగా ఎదుర్కొలేకనే ఎంఐఎం నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.