27 July, 2026 | 6:31 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల దాడి

19-05-2026 07:14 PM

ట్రాక్టర్ సీజ్.. కేసు నమోదు

పెంచికలపేట,(విజయ క్రాంతి): పెంచికలపేట మండల కేంద్ర పరిధిలోని పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు. పెద్దవాగు ప్రాంతంలో తనిఖీలు నిర్వహించగా, ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను గుర్తించినట్లు ఎస్సై తెలిపారు. వెంటనే వాహనాన్ని సీజ్ చేసి సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. ఈ తనిఖీల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.