4 May, 2026 | 4:17 PM

Breaking News

చరిత్ర సృష్టించిన విజయ్.. దళపతి ప్రస్థానం ఇదే..!   •   మంత్రి శ్రీధర్ బాబుకు శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వానం   •   డంపింగ్ యార్డును తరలించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి   •   సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేసిన మేయర్   •   అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలంటూ తాసిల్దార్ కు వినతి   •   తల్లి ఏడవకండి.. మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది   •   ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం   •   కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •  

ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం

04-05-2026 03:18 PM

చైర్మన్ అల్లంకి  సత్యనారాయణ

సుల్తానాబాద్,(విజయక్రాంతి): మండుతున్న  ఎండల దృశ్య ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు గాను సుల్తానాబాద్ వాసవి క్లబ్, వాసవి క్విన్స్ క్లబ్ ల ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బస్టాండ్ లో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినంద నీయమని స్థానిక శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణ అన్నారు. సోమవారం సుల్తానాబాద్ ఆర్టీసీ బస్టాండ్ లో ఏర్పాటు చేసిన చలివేంద్రంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చలివేంద్రంలో చల్లటి నీళ్లు అందజేయడం జరుగుతుందని  ప్రయాణికులు అందరూ సద్వినియోగపరచుకోవాలని  కోరారు.

ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ అల్లంకి లింగమూర్తి, జిల్లా క్యాబినెట్ జాయింట్ సెక్రెటరీ ఎల్లంకి రాజన్న, కాసం సత్యనారాయణ, జిల్లా ఇంఛార్జి ఆఫీసర్ (ఉమెన్ ఎంపవర్మెంట్) బాదం వాణి,  జోన్ చైర్మన్ అల్లంకి హరిష్ కుమార్, వాసవి క్లబ్ అధ్యక్షులు రామిడి రవీందర్, ప్రధాన కార్యదర్శి సముద్రాల శ్రావణ్ కుమార్, కోశాధికారి పుల్లూరి రమేష్, వాసవి వనిత క్వీన్స్ క్లబ్ అధ్యక్షురాలు ఎల్లంకి విజయ, ప్రధాన కార్యదర్శి నార్ల మాధవి, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్టు కొమురవెల్లి భాస్కర్, ప్రధాన కార్యదర్శి తోడుపునూరి రాజేంద్రప్రసాద్  వాసవి క్లబ్, వనిత క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.