4 May, 2026 | 4:00 PM

Breaking News

చరిత్ర సృష్టించిన విజయ్.. దళపతి ప్రస్థానం ఇదే..!   •   మంత్రి శ్రీధర్ బాబుకు శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వానం   •   డంపింగ్ యార్డును తరలించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి   •   సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేసిన మేయర్   •   అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలంటూ తాసిల్దార్ కు వినతి   •   తల్లి ఏడవకండి.. మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది   •   ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం   •   కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •  

మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్

04-05-2026 02:45 PM

బోథ్,(విజయక్రాంతి): భరోసా లేని రైతు జీవితానికి తమ ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన మండలంలోని కనుగుట్ట గ్రామంలో అగ్ని ప్రమాదంలో కాలిపోయిన రైతుల భూములలోని పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు నెలల పాటు పసిపిల్లలను సాదుకున్నట్టు రైతులు పంటను సాదుకొని పంట ఇంటికి వచ్చే సమయంలో అగ్ని ప్రమాదానికి గురై కాలిపోవడం బాధాకరమైన విషయం అన్నారు.

అయితే ప్రతి చోట రైతుకు చిన్న చూపే చూడడం జరుగుతుందని తమ ప్రభుత్వం రైతుకు బాసటగా నిలుస్తున్న అన్నారు. రైతన్నకి పంటలకు భీమ చేయించాలని కనుక గ్రామానికి చెందిన బొడ్డు అశోక్ అనే రైతు చైర్మన్ దృష్టికి తీసుకురాగా ఈ విషయమై అన్ని విధాలుగా పరిశీలించడం జరుగుతుందని ఇతర రాష్ట్రాలలో ఏ విధంగా రైతాంగానికి పంటల బీమా అమలవుతుందని విషయాన్ని పరిశీలిస్తున్న ఉన్నారు. అగ్ని ప్రమాదానికి విద్యుత్ శాఖ అధికారులే కారణమని అయితే సంబంధిత ఏ ఈ లైన్మెన్ లపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేస్తున్నామన్నారు.

పంట కొనుగోళ్ల విషయంలో ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దని 16 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతున్నదని పంట సాగు అధికంగా ఉన్నందు న కొనుగోలలో కొంత జాబితా జరుగుతుందన్నారు. ప్రతిపక్షాల అమ్మవారి మాటలు విని రైతులు ఆగం కావద్దన్నారు .గ్యారెంటీ లేని రైతన్నకుతమ ప్రభుత్వం సబ్సిడీ పైన యంత్రాలను ఇవ్వడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం కేవలం రైతు భరోసా నిధులు వేసి చేతులు దులుపుకుందని మిగతా విషయాలలో రైతులు పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వం ఆర్థికంగా పరిపుష్టిగా లేకున్నా భవిష్యత్తులో రైతన్న అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.