ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు పెంచాలి
మఠంపల్లి ఆగస్టు 25(విజయ క్రాంతి): పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మండలంలోని కొత్త దొనబండ తండా సర్పంచ్ అరుణాదేశ్ పాండు పిలుపునిచ్చారు. మంగళవారం వన మహోత్సవం సందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటి మొక్కలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కలు నాటడం మాత్రమే కాకుండా, అవి పెద్దవయ్యే వరకు క్రమం తప్పకుండా నీరు పోసి సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని,గ్రామంలో పచ్చదనం పెంచేందుకు ప్రజలు ముందుకు రావాలని, ఇంటి పరిసరాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, రహదారుల వెంట విరివిగా మొక్కలు నాటాలని సూచించారు.
చెట్లు పెరగడం వల్ల పర్యావరణ సమతుల్యత కాపాడటంతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం అందుతుందని తెలిపారు. ప్రతి కుటుంబం కనీసం కొన్ని మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకుంటే గ్రామం పచ్చని వనంగా మారుతుందని సర్పంచ్ అరుణాదేశ్ పాండు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ధరవతు నితిన్,వార్డు సభ్యులు నాగేశ్వరరావు,చంద్రు నాయక్, సోముడు,లాలు,హభ తదితరులు పాల్గొన్నారు.






