4 May, 2026 | 4:25 PM

తల్లి ఏడవకండి.. మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది

04-05-2026 03:22 PM

బోత్,(విజయక్రాంతి): మండలంలోని కనుగుట్ట గ్రామంలో దగ్ధమైన మొక్కజొన్న పంట చేలను సోమవారం ఉదయం విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి పరిశీలించారు. పంటలను పరిశీలిస్తున్న సమయంలో నష్టపోయిన రైతుల కుటుంబీ కులు నాయకులను చూసి బోరున విలపించారు. వారి ఆవేదనను చూసిన నాయకులు చెల్లించి పోయాడు. తల్లి ఏడవకండి నేను రైతు కుటుంబానికి చెందిన వాడను నాకు రైతు కష్టాలు తెలుసు భరోసా లేని రైతు కుటుంబాలకు బాసటగా మా ప్రభుత్వం నిలుస్తుంది.

జరిగిన నష్టం పరిశీలించాను. ప్రభుత్వం నష్టం అంచనాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది.. పూర్తి వివరాలు అందగానే ముఖ్యమంత్రికి సమస్యను విన్నవిస్తాను. నష్టపోయిన రైతుల పరిస్థితులను పరిశీలించేందుకు వెళుతున్నానని సంబంధిత మంత్రులకు వివరిస్తే వెళితే వారి నాదుకోవాల్సి ఉంటుంది కదా అన్నారు. వాస్తవాలు తెలుసుకొని ఆదుకుంటామని చెప్పి వస్తానని మంత్రులకు తెలిపాను అన్నారు.

తమ ప్రభుత్వం రైతుల కోసం ఉందని అయితే ప్రకృతిని ఎదిరించి ఆటుపోట్ల గురై రైతులకు పండిస్తున్న పంటలను కొనుగోలు చేయడంతో పాటు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతామన్నారు. జరిగిన నష్టం చాలా ఉందని ఎలాంటి ఆందోళన చెందవద్దని వివరించారు. మంటలను ఆర్పేందుకు సాహసం చేసిన యువకుల ధైర్యాన్ని అభినందించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ సంఘటన చోటుచేసుకుందని నిర్ధారణకు వచ్చామని సంబంధిత అధికారుల పైన తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామన్నారు.