30 August, 2026 | 6:36 PM

వివాహ వేడుకలో పాల్గొన్న చల్మెడ

30-08-2026 05:34 PM

నూతన వధూవరులకు ఆశీర్వాదం

కోనరావుపేట, ఆగస్టు 30 (విజయక్రాంతి): కోనరావుపేట మండలం మల్కపేట గ్రామానికి చెందిన జవ్వాజి ఎల్లాగౌడ్ కుమార్తె వివాహ వేడుక ధర్మారం ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు, కరీంనగర్ డైరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వరరావుతో కలిసి వివాహ వేడుకకు హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, ఉపసర్పంచ్ బీరయ్య, మిర్యాల ప్రభాకర్‌రావు, భూమారెడ్డి, మహేందర్, సతీష్, వినోద్, అంజయ్య, జవ్వాజి అంజయ్య, తిరుపతి, ఎదురుగట్ల అంజయ్య, పొన్నం పరశురామ్, చంద్రయ్య, నాగుల రాజు, రమేష్‌రావు, కట్ట తిరుపతి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.