బాధిత కుటుంబాన్ని పరామర్శించిన చల్మెడ
27-08-2026 11:09 PM
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన గుమ్మడి లక్ష్మి (40) ఇటీవల ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఇంటి పైకప్పు కూలి మృతి చెందిన విషయం తెలిసిందే. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇల్లు శిథిలావస్థకు చేరడంతో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, లక్ష్మి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.చల్మెడ వెంట మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, సర్పంచ్ కుంటెల్లి నాగరాజు, ఉపసర్పంచ్ నవీన్, సీనియర్ నాయకులు భూమా రెడ్డి, జిన్న అనిల్, నాగరాజు, మహేష్, సుమన్, శివతేజ, అన్వేష్ తదితరులు ఉన్నారు.






