ఓయూకు రూపాయిలేదు
- సీఎం ఇస్తానన్న వెయ్యి కోట్లు ఎక్కడ?
- హౌస్ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరు
- బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు
- రామంతపూర్ పాలిటెక్నిక్‌కు వెళ్లకుండా హౌస్ అరెస్ట్
- ఎంపీ ఈటల సంఘీభావం
హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఎమర్జెన్సీ తరహా మైండ్‌సెట్‌తో ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన సాగిస్తోందని, సమస్యలపై గళమెత్తే ప్రతిపక్షా లు, విద్యార్థుల(students)పై పోలీసు నిర్బంధాలను ప్రయోగిస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు(N. Ramchander Rao) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీకి రూ.వెయ్యి కోట్లు ఇస్తానని చెప్పి ఏడాది గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం దారిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తోందన్నారు. విద్యార్థుల విషయంలో బీఆర్‌ఎస్‌కు మాట్లాడే అర్హత లేదన్నారు. హౌస్ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామంతపూర్ ప్రభుత్వ పాలిటె క్నిక్ కళాశాల విద్యార్థులను పరామర్శించేందుకు, వారికి మద్దతు తెలిపేందుకు బయల్దేరిన రాంచందర్ రావుని తార్నాకలోని ఆయన నివాసంలో పోలీసులు బుధవారం ఉదయం హౌస్ అరె స్ట్ చేశారు.
రాంచందర్ రావు నివాసానికి వెళ్లి సంఘీభావాన్ని బీజేపీ ఎంపీ ఈటల రా జేందర్ తెలిపారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మీడియాతో మాట్లాడారు. విద్యా ర్థుల పక్షాన నిలబడాల్సిన బాధ్యతగల ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని, విద్యార్థులను కలవకుండా ఇంటి చుట్టూ భారీగా పో లీసులను మోహరించి అడ్డుకోవడం ప్రభు త్వ పిరికితనానికి పరాకాష్ట అనిమండిపడ్డా రు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఒకవైపు లక్షలాది మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు ఇవ్వకుం డా ఆగం చేస్తుంటే, మరోవైపు ఆయుష్ వి ద్యార్థులకు, జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్లు సక్రమంగా ఇవ్వట్లేదని విమర్శించారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో పీజీ విద్యార్థులకు నెలకు రూ.26 వేలు, సూపర్ స్పెషాలిటీ వా రికి రూ. 30 వేల వరకు స్టైఫండ్లు ఇస్తుంటే, తెలంగాణలో మాత్రం కేవలం రూ. 13 వేల నుంచి రూ. 15 వేలకే పరిమితం చేసి విద్యార్థుల పొట్టకొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశించినా స్టైఫండ్లు పెంచకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
కంటితుడుపు చర్యగా హైలెవల్ కమిటీ..
పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును జీవో 97 ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘శక్తి స్కీమ్’ పేరుతో వింత ప్రయోగాలు చేస్తూ, సాంకేతిక విద్యను కేవలం నా మమాత్రపు స్కిల్ డెవలప్‌మెంట్‌గా మార్చి, పాలిటెక్నిక్ విద్యార్థుల చదువును అవమానపరుస్తున్నారని విమర్శించారు. పాలిటెక్నిక్ పూర్తయిన విద్యార్థులకు ఇంజనీరిగ్‌లో ప్రవేశానికి ఉన్న ‘ఈసెట్’ అవకాశాలను దూరం చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చే స్తుంటే వారిపై లాఠీఛార్జీలు చేయించడం, అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం వేసిన హైలెవల్ కమిటీ కేవలం కంటితుడుపు చర్య మాత్రమేనని, కంటితుడుపు కమిటీలతో కాలయాపన చేయకుండా పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
విద్యా విధ్వంసంపై రాహులు నోరు విప్పాలి..
విద్యాశాఖను తనవద్దే ఉంచుకున్న ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో విద్యార్థులు పడుతున్న గోడును పట్టించుకోకుం డా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పాఠశాలల్లో ఉపాధ్యా యులు లేక, విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు, లెక్చరర్లు లేక ఉన్నత విద్య సైతం భ్రష్టుపట్టిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తిరుగుతూ డ్రామాలు ఆడటం మానేసి, తెల ంగాణలో విద్యా విధ్వంసంపై నోరు విప్పాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల కోసం వె ళ్తున్న తనపై పోలీసులు పెట్టిన అక్రమ గృ హనిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. పోలీసు ఆంక్షలు తొలగిన వెం టనే పాలిటెక్నిక్ విద్యార్థులను కచ్చితంగా కలిసి వారికి బీజేపీ అండగా నిలుస్తుందని, విద్యార్థుల హక్కులు సాధించేవరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజీలేని పోరాటం కొనసాగిస్తామని రాంచందర్ రావు స్పష్టం చేశారు.
శక్తి స్కీంపై విద్యార్థులతో కూర్చొని మాట్లాడాలి: ఎంపీ ఈటల రాజేందర్
జీవో నెం.97 తీసుకొచ్చి విద్యార్థులను రోడ్లు మీద పడేశారని, పాలిటెక్నిక్ విద్యార్థు లు, తల్లి దండ్రులు ఆందోళన చెందుతున్నారని ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఝుళిపిస్తున్నారని, రామంతా పూర్ విద్యార్థులను కలుస్తామంటే తమ పార్టీ అధ్యక్షుని హౌస్ అరెస్టు చేయడం సిగ్గు చేటన్నారు. జీవో 97, శక్తి స్కీంను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
హైపర్ కమిటీ ఎందుకు? అని, శక్తి స్కీం విధివిధానాలపై విద్యార్థులు, లెక్చరర్లతో కూ ర్చొని మాట్లాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, లేదంటే తర్వా త జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. మరోవైపు 22ఏ నిషేధిత జాబితాతో సీఎం రేవంత్ రెడ్డి పాలనాపై ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారని, 1965లో వెలిసిన అపార్ట్ మెంట్ ఇండ్లు 22ఎలో పెట్టారన్నారు. దీనిపై ప్రతి పక్షాల కుట్ర అనడం ప్రభుత్వానికి సరికాదన్నారు.






