28 August, 2026 | 1:26 PM

సత్తుపల్లి నియోజకవర్గంలో టీడబ్ల్యూజేఎఫ్ పాదయాత్రకు అపూర్వ స్పందన

28-08-2026 08:33 AM

మండల కేంద్రాల్లో పలు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు, పాదయాత్ర బృందానికి సంఘీభావం-

 సత్తుపల్లి. ఆగస్టు 28, (విజయక్రాంతి): టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ(TWJF District Committee) ఆధ్వర్యంలో ఇండ్ల స్థలాల సాధన కోసం జిల్లాలోని పలు నియోజకవర్గాలలోని మండల కేంద్రాల్లో జరుగుతున్న పాదయాత్రకు(TWJF padayatra) అడుగడుగునా అపూర్వ స్పందన లభిస్తోంది. పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, వివిధ మండలాల కేంద్రాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు సంఘాలకు అతీతంగా పాదయాత్ర బృందానికి సంఘీభావం తెలుపుతూ పాదయాత్రను ముందుకు సాగిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం సత్తుపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో జరిగిన టీడబ్ల్యూజేఎఫ్ పాదయాత్రకు విశేష స్పందన లభించింది.

ఉదయం 10 గంటలకు తల్లాడ మండల కేంద్రంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర కల్లూరు, పెనుబల్లి, వేంసూరు మండలాల మీదుగా సత్తుపల్లికి చేరుకుంది. సత్తుపల్లికి వచ్చిన పాదయాత్ర బృందానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్,  రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ తోపాటు కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్ర బృందాన్ని కలుసుకొని సంఘీభావం తెలిపారు. వీరితోపాటు బీఆర్ఎస్ సీపీఐ(ఎం), ప్రజాపంథా మాస్ లైన్, ఐద్వా, జనసేన నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. వీరితోపాటు సత్తుపల్లి పట్టణంలో వివిధ పత్రికలు,  ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు సంఘాలకు అతీతంగా పాదయాత్ర బృందానికి సంఘీభావం తెలిపి తమ మద్దతును ప్రకటించారు. తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి మండలాల్లో జరిగిన ఈ పాదయాత్ర సందర్భంగా ఆయా మండలాల తహసిల్దార్లకు వినతి పత్రాలు అందించి ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఖదీర్, శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులు సాగర్ నాగేందర్ రెడ్డి కోరారు.

ఈ పాదయాత్ర కార్యక్రమంలో టీబీజేఏ జిల్లా కార్యదర్శి మానుకొండ రవికిరణ్ స్టేట్ కౌన్సిల్ మెంబర్లు సభ్యులు సిహెచ్ బాలకృష్ణ, నాగేందర్ రెడ్డి, నలుబోల మధుశ్రీ, టీఎస్ చక్రవర్తి గరిడేపల్లి వెంకటేశ్వర్లు, కొరకుప్పల రాంబాబు టీబీజీఏ కెమెరామెన్ జిల్లా కార్యదర్శి భూక్యా గణేష్, కోశాధికారి యూసఫ్, అక్రిడేషన్ కమిటీ మెంబర్అర్షద్, నాయకులు గంగుల గోపి మందా శరత్ చిర్రా పవన్, సత్తుపల్లి డివిజన్ నాయకులు చీపు గంగాధర్ గౌడ్, రంగు అయ్యప్ప, కొత్తపల్లి సుధాకర్ జమ్ముల రాజేష్ రెడ్డి ఎస్కే బాజీ, మల్లూరు చంద్రశేఖర్, నల్లటి మోహన్ మారోజు అశోక్ హరిబాబు, బీఆర్ఎస్ నాయకులు కూసంపూడి మహేష్ కొత్తూరు ఉమామహేశ్వర రావు చాంద్ పాషా ఆనందరావు, సిపిఎం నాయకులు జాజిరి శ్రీనివాస్, కొలికపోగు సర్వేశ్వరరావు, ఐద్వా నాయకురాలు జాజిరి జ్యోతి, చెరుకు కుమారి, పుష్పవల్లి, మాస్ లైన్ నాయకులు గంటా శ్రీనివాస్ అమర్లపూడి శరత్ పాల్గొన్నారు.