28 August, 2026 | 4:57 AM

పోరు ఆగదు!

28-08-2026 02:32 AM

బాకీ పడ్డారు.. చెల్లించండి

మహాధర్నా

గళమెత్తిన ఉద్యోగులు

  1. జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు 
  2. జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు 
  3. హైదరాబాద్ ధర్నాచౌక్‌లో మహాధర్నా 
  4. న్యాయమైన హక్కులనే అడుగుతున్నాం 
  5. పీఆర్సీ రిపోర్టు ఇంకా తెప్పించుకోలేదు 
  6. ప్రభుత్వం చెప్పినా అధికారులు చేయడంలేదు 
  7. ఉద్యోగులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదు 
  8. సీఎంను ఎనిమిదిసార్లు కలిసినా సమస్యలు పరిష్కారం కావడంలేదు 
  9. భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బందులు తప్పవు 
  10. ఉద్యోగుల వ్యతిరేకతను మూటగట్టుకోవద్దు 
  11. రాష్ట్ర ప్రభుత్వంపై జేఏసీ నేతల మండిపాటు

ఉద్యోగుల డిమాండ్లు ఇవే..

* రెండో పీఆర్సీ అమలు చేయాలి.

* ఆరు పెండింగ్ డీఏలు విడుదల చేయాలి.

* రూ.10 వేల కోట్ల ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి.

* సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి.

* నూతన ఉద్యోగుల హెల్త్ స్కీం విధివిధానాలు అమలుచేసి తక్షణమే ఆరోగ్య సేవలు అందించాలి.

హైదరాబాద్/ముషీరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): పీఆర్సీ(PRC) ప్రకటించాలని, ఉద్యోగులకు బాకీపడ్డ పెండింగ్ డీఏ లు విడుదల, న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీం(New Employees Health Scheme) సమర్థవంతంగా అమలు వంటి పెండింగ్ డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, గెజిటెడ్ అధికారులు, పెన్షనర్లు(Employees, teachers, workers, gazetted officers, and pensioners.) రాష్ట్రవ్యాప్తంగా గళమెత్తారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ(Telangana Employees JAC) ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యమబాట చేపట్టారు.

హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద హైదరాబాద్ జిల్లా, హైదరాబాద్ సిటీ, రంగారెడ్డి జిల్లాల ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేతలు, ఉద్యోగులు, ఉపాధ్యాయు లు వేలాదిగా మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్ల వద్ద ఉద్యోగులు ఎక్కడికక్కడ ధర్నా కు దిగారు. తమ న్యాయమైన డిమాండ్ల ను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాని కి వ్యతిరేకంగా ఉద్యోగులు నినదించారు. సీఎం మీద ఉన్న గౌరవంతో ఇంతకాలం ఓపికపట్టామన్నారు.

ధర్నా చౌక్‌లో చేపట్టిన మహాధర్నా కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరనీ జనరల్ ఏలూరి శ్రీనివాస్, జేఏసీ నాయకులు చావ రవి, రవీందర్ రెడ్డి, సదానంద్ గౌడ్, ముజీబ్ హుస్సేన్, బీ శ్యామ్, మధుసూద న్‌రెడ్డి, సత్యనారాయణగౌడ్, కృష్ణమూర్తి, కస్తూరి వెంకటేశ్వర్లు, ఉమారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈసందర్భంగా జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నా కిందిస్థా యిలో తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదన్నారు.

క్యాబినెట్ సబ్ కమిటీ, ఐఏఎస్ అధికారుల కమిటీలతోపాటు, మం త్రులు, ఉన్నతాధికారులను ఎన్నోసార్లు కలిసినా సమస్యలు పరిష్కారం కావడంలేదన్నా రు. పీఆర్సీ గడువు దాటి మూడేళ్లవుతోందని, ఇంతవరకు పీఆర్సీ రిపోర్టును తెప్పించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. పెండింగ్ బిల్లుల తో ఉగ్యోగులకు బాకీ పడ్డ రూ.10 వేల కోట్లు విడుదల చేయాలని కోరారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీంను పకడ్బందీగా అమలుచేయాలని, ఉగ్యోగులకు ఇంకా అన్ని హాస్పిటల్స్‌లో వైద్యం అందడంలేదన్నారు.

మా హక్కులు, మా జీతభత్యాలనే అడుగుతున్నామని, కొత్త కోర్కెలు అడగడంలేదన్నారు. ఇంకా తమవి చాలా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వం తమతో చర్చించాలన్నారు. ఉద్యోగుల్లో తీవ్ర అసహనం నెలకొందని చెప్పారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తమ ఉద్దేశం కాదుకానీ.. తమపై ఉద్యోగుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉందన్నారు. ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్ర భుత్వమూ మనుగడ సాగించలేదని ఆయన హెచ్చరించారు.

సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస రావు మాట్లాడుతూ.. ఇంత వరకూ తాము ప్రభుత్వానికి సహకరించామని, సమన్వయంతోనే నడుచుకున్నామని, అయితే తమకు ప్రభు త్వం ఇచ్చిన హామీలు ఇంతవరకూ అమలుకాలేదన్నారు. తాము కొత్తవి అడగడంలేదని, ఆరు డిమాండ్లనే పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. హెల్త్ స్కీంతోపాటు ఇతర డి మాండ్ల పరిష్కారం అంశంలో సీఎం, డిప్యూ టీ సీఎంలు చెప్పినా గానీ, అధికారుల అలసత్వం కారణంగా అవి అమలుకు నోచుకో వడంలేదని పేర్కొన్నారు.

పీఆర్సీ అమలు, డీఏ బకాయిల కొరకు ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా చలనం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ధర్నా ప్రభుత్వానికి ఒక గట్టి హెచ్చరిక అన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించకుంటే భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బందులు తప్పవన్నారు. పీఆర్సీ నివేదిక విడుదలయ్యే వరకు తాము ముందస్తుగా ప్రకటించిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా ప్రతిరోజూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామన్నారు. సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా, 10వ తేదీన హైదరాబాద్ లో మహాధర్నా కార్యక్రమాన్ని చేపడతామన్నారు.

జేఏసీ నాయకులు, టీఎన్జీవో ప్రధాన కా ర్యదర్శి ముజీబ్ హుస్సేన్ మాట్లాడుతూ.. ప్ర భుత్వానికి రెండున్నరేళ్ల సమయమిచ్చామని, ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నాగానీ, అధికారులు మాత్రం వినే పరిస్థితిలేదన్నారు. సంబంధింత శాఖ మంత్రులు కూడా తమ సమస్యలపై సమీక్ష చేసే పరిస్థితిలేదని, తాము ఇక చేసేదిలేకనే ఆందోళనబాట చేపట్టామన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం పిలిచి సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే తమ న్యాయమైన డి మాండ్లు సాధించుకునేవరకు పోరాటం ఆగదన్నారు.

పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు ఇంకా కొంత రావల్సి ఉందని, వాటిని కూడా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జేఏసీ నాయకులు, టీజీవో ప్రధాన కార్యదర్శి బీ శ్యామ్ మాట్లాడుతూ.. మూడేళ్లుగా తమ సమస్యలపై పోరాటం చేస్తున్నామ ని, ఇప్పటి వరకు సీఎంను ఉద్యోగుల జేఏసీ ఎనిమిదిసార్లు కలిసిందన్నారు. కలిసిన ప్రతిసారి ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని అంటున్నారని, అయి తే బీఆర్‌ఎస్ ప్రభుత్వం మినహా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒకటో తేదీనే జీతాలు చెల్లించేవారన్నారు.

ఇదేదో గొప్ప విషయమన్నట్లు గా ప్రభుత్వం పదే పదే చెప్పడం సరైంది కాదన్నారు. జీతాలు తప్ప మిగిలిన ఏ సమస్యలు పెద్దగా పరిష్కరించలేదన్నారు. పిల్లల చదువుల కోసం, పెళ్లిల కోసం తాము దాచుకున్న డబ్బులను కూడా ఇవ్వడంలేదన్నారు. దేశంలోనే జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రం రెండో స్థానం లో ఉందని, ఆర్థిక పరిపుష్టి కలిగిన రాష్ట్రంగా ఉందని, తమ సమస్యలను పరిస్కరించాలని కోరారు.

ఇప్పటికే మూడేళ్లు కావొస్తున్నదని, ప్రభుత్వంపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రాకముందే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 33 జిల్లాల్లో ఉద్యోగులందరూ పాల్గొంటున్నారని, ప్రభుత్వం స్థంభిస్తే ఆర్థిక ప్రగతి ఏ విధంగా ముందుకు సాగుతుందో ఆలోచించాలన్నారు ఈ కార్యక్రమం లో జేఏసీ నాయకులు దాస్య నాయక్, అబ్దు ల్లా, విక్రమ్‌కుమార్, క్రిష్ణ యాదవ్,  శ్రీకాంత్, గండూరి వెంకటేశ్వర్లు, రామారావు, యశ్వం త్, శ్రీనేష్ కుమార్, నిరంజన్, శ్రీనివాస్, ఖాదర్, చందు తదితరులు పాల్గొన్నారు.