28 August, 2026 | 3:41 AM

పైన పటారం.. లోన లొటారం!

28-08-2026 02:25 AM

కార్పొరేట్ హంగులు ఫుల్.. సేవలు నిల్

  1. కాంట్రాక్టర్లకు కాసులు.. కొరవడిన సౌకర్యాలు 
  2. అసంపూర్తి పనుల మధ్యే ప్రారంభోత్సవం 
  3. అందుబాటులోకి రాని కీలక పరీక్షలు 
  4. ఉస్మానియా, గాంధీకి రిఫర్ 
  5. డాక్టర్లు, నర్సుల కొరత 
  6. డిప్యూటేషన్లతో నెట్టుకొస్తున్న దుస్థితి

రంగారెడ్డి, అగస్టు 27(విజయక్రాంతి): కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన సనత్‌నగర్ టిమ్స్ (తెలంగాణ ఇనిస్టి ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)(Telangana Institute of Medical Sciences).. ఆర్భాటానికి తగ్గ సేవలు అందించడంతో మాత్రం విఫలమవుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తామన్న ప్రభుత్వ హామీలకు.. క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిర్మాణ పనులు పూర్తికాక ముందే ప్రారంభోత్సవం, కీలక వైద్య పరీక్షలకు ఆటంకాలు, నీటి సరఫరా, ఆక్సిజ న్ సమస్యలు, మందుల కొరత, వైద్యులునర్సుల కొరత వంటి సమస్యలు వెంటా డుతున్నాయి. అత్యాధునిక పరికరాలు, భారీ భవనం ఉన్నా.. పూర్తిస్థాయి వైద్యసేవలు అందక రోగులు గాంధీ, ఉస్మాని యా ఆస్పత్రులబాట పడుతున్న పరిస్థితి.    

కాంట్రాక్టర్ల కోసమేనా?

ఉచిత మెయింటెనెన్స్ ఎగవేత.. నిబంధనల ప్రకారం భవనం పూర్తయ్యాక ఏడాది పాటు కాంట్రాక్టరే ఉచితంగా నిర్వహణ  చూసుకోవాలి. కానీ, ఐదో అంతస్తు పనులు ఇంకా పూర్తికాకముందే 3-4 నెలల ముందే హడావుడిగా ప్రారంభోత్సవం చేయించడం వెనుక పెద్ద కుట్ర ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. పను లు అసంపూర్తిగా ఉన్నప్పటికీ కాంట్రాక్టర్లకు కోట్లాది రూపాయల నిర్వహణ బిల్లులు క్లెయిమ్ అయ్యేలా అధికారులు సహకరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు కోట్ల రూపాయ లు వెచ్చించి విదేశాల నుంచి తెప్పించిన అత్యాధునిక మెడికల్ పరికరాలు లోపలికి తీసుకెళ్లడానికి వీలు లేకుండా గదుల ద్వారాలను చిన్నవిగా నిర్మించారు. వీటిని కూల్చి పరికరాలను లోపలికి తీసుకెళ్తున్నారు. నిర్మాణ ప్లానింగ్ లోపాలు, డిజైన్ వైఫల్యాల వల్ల ప్రజాధనం నీళ్లలా ఖర్చవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

నీళ్ల నుంచి ఆక్సిజన్ వరకు..

జలమండలికి బిల్లులు చెల్లించకపోవడంతో ఆస్పత్రికి నీటి సరఫరా నిలిచిపో యింది. ప్రైవేట్ ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. వీటికి నిత్యం వేలాది రూపాయలు తగలేస్తున్నారు. ర్యాంప్‌లు, స్ట్రెచర్లు లేకపోవడంతో వృద్ధులను, పసిపిల్లలను వారి సంబంధికు లు చేతులపై మోస్తూ పైఅంతస్తులకు తీసుకెళ్తున్నారు.

ఆక్సిజన్ పైప్ లైన్లు సరిగ్గా లేక, మాడ్యులర్ ఓటీలు సరిగ్గా పనిచేయక అత్యవసర శస్త్రచికిత్సలు బంద్ అయ్యాయి. వెయ్యి పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీగా రూ పుదిద్దుకున్న ఈ ఆస్పత్రిలో.. 200 నుంచి 300 వరకు ఐసీయూ, వెంటిలేటర్ బెడ్లు కేటాయించినట్లు ఆస్పతి ప్రారంభానికి ముందు అధికారులు స్పష్టం చేశారు. 

మల్టీ-స్పెషాలిటీ సేవలు..

కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, ఆంకాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ వంటి కీలక విభాగాలతో పాటు పాత ఆసుపత్రికి సంబంధించిన పల్మనాలజీ (ఊపిరితిత్తులు/ఛాతీ వ్యాధులు) విభాగం కొనసాగుతున్నాయి. 

ఆధునిక రోగనిర్ధారణ కేంద్రాలు..

డిజిటల్ ఎక్స్-రే, 128 -స్లైస్ సీటీ స్కాన్, అత్యాధునిక ఎంఆర్‌ఐ, 24 గంటల సెంట్రల్ ల్యాబొరేటరీ సేవలు అం దుబాటులో ఉన్నాయి.  

మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు..

ఇన్ఫెక్షన్ రహిత వాతావరణంలో సంక్లిష్ట శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు ఆధునిక మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేశారు.

ఎమర్జెన్సీ, ట్రామాకేర్ సెంటర్..

తీవ్ర అత్యవసర కేసులు, రోడ్డు ప్రమాద బాధితులకు వేగంగా చికిత్స అందజేసేందుకు ప్రత్యేక ట్రయేజ్, ట్రా మా కేర్ విభాగం ఏర్పాటు చేశారు. ప్రధాన లోపాలు - రోగులు సవాళ్లు ఎదుర్కొంటున్నారు, అలాగే సిబ్బంది కొరత అత్యాధునిక భవనాలు సిద్ధమవుతున్నా.. పూర్తిస్థాయిలో అవసరమైన సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, స్పెషలి స్టులు, నర్సింగ్ సిబ్బంది నియామకాలు ఇంకా పూర్తి అందుబాటులోకి రాకపోవడం.

గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల బాట..

ప్రాణరక్షక మందులు లభించక, డయాగ్నస్టిక్ ట్రయల్ రన్స్ పూర్తికాక సాధారణ సీరియస్ కేసులను కూడా గాం ధీ, ఉస్మానియా ఆస్పత్రులకు తరలిస్తూ అధికారులు చే తులు దులుపుకుంటున్నారు. ప్రభుత్వం 2,360 పోస్టులు మంజూరు చేశామని చెప్పినప్పటికీ, ఒక్క శాశ్వత నియామక నోటిఫికేషన్ ఇవ్వలేదు. నిమ్స్, ఉస్మానియా నుంచి కొద్దిమందిని తెచ్చి, పీజీ డాక్టర్లపైనే మొత్తం దవాఖాన భారాన్ని నెట్టేశారు. లోపాలు బయటపడకుండా సెక్యూరిటీ గార్డులతో పహారా కాస్తూ, మీడియాను, బాధితుల ను ఫొటోలు తీయకుండా బెదిరిస్తున్నారు.

డయాగ్నోస్టిక్ సేవలో తీవ్ర జాప్యం

కొన్ని కీలక పరీక్షలకు పరికరాలు సిద్ధంగా ఉన్నా ట్రయల్ రన్స్ ఇంకా పూర్తికాలేదు. ఔట్- పేషెంట్ విభాగాల్లో సరైన టోకెన్ లేదా క్యూ మేనేజ్‌మెంట్ వ్యవస్థ లేకపోవడంతో గంటల తరబడి సనత్‌నగర్ ప్రధాన రహదారి నుంచి ఆసుపత్రి ప్రాంగణానికి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్‌లు, ఆసుపత్రి పరిసరాల్లో రోగుల బంధువుల వాహనాలకు తగినంత పార్కింగ్ వసతి లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

జనరల్ మందులు అందుబాటులో ఉన్నప్పటికీ, కొన్ని ప్రాణ రక్షణ మరియు కాన్సర్, కిడ్నీ సంబంధిత ఖరీదైన ఇంజెక్షన్లు/మందుల కొరత నెలకొంది. లక్షలాది మంది నిరుపేదలకు పెనుభారమైన వైద్య ఖర్చుల నుంచి ఊరట లభించా లంటే కేవలం భవనాల నిర్మాణమే కాకుండా..పూర్తిస్థాయి డాక్టర్ల నియామకం, అన్ని యంత్రాలు 24 గంటలు పనిచేసేలా పర్యవేక్షణ వ్యవస్థను ప్రభుత్వం తక్షణమే పటిష్టం చేసి, పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రోగులకు ఎంతో ఉపయోగపడుతుంది.

ప్రభుత్వం ఏం చేయాలి?

కేవలం రంగుల భవనాలు కట్టడం మాత్రమే కాదు.. నిబంధనలు ఉల్లంఘించిన నిర్మాణ సంస్థపై, అక్రమాలకు సహకరించిన అధికారులపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. తక్షణమే శాశ్వ త డాక్టర్ల నియామకం చేపట్టి, డయాగ్నస్టిక్ పరికరాలను, నీటి సరఫరాను పునరుద్ధరించి ఆస్పత్రిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేకపోతే ప్రజాక్షేత్రంలో నిరసనలు తథ్యం.