calender_icon.png 5 July, 2025 | 12:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడో రేపో ట్రేడ్ డీల్‌కు అవకాశం

05-07-2025 02:14:54 AM

  1. చివరి దశకు భారత్ వాణిజ్య ఒప్పందం

సుంకాల వివరాలపై రోజుకు పది దేశాలకు లేఖలు 

ఈ నెల 9తో ముగియనున్న సుంకాల మినహాయింపు గడువు

వాషింగ్టన్, జూలై 4: భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం నేడో రేపో ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుంకా ల అమలును జూలై 9వరకు వాయిదా వేస్తూ అమెరికా అధ్యక్షుడు గతంలో ఆదేశా లు జారీ చేశారు. ఆ గడువు సమీపిస్తున్న తరుణంలో ఈ ఒప్పందాన్ని తొందరగా ఖరారు చేసేందుకు రెండు దేశాల ప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నారు.

అమెరికా వేయబోయే సుంకాల గురించి వివరిస్తూ నేటి నుంచి రోజుకు పది దేశాలకు లేఖలు రాయనున్నట్టు అధ్యక్షుడు తెలిపారు. ఈ లేఖల్లో ఎంత శాతం సుంకం వేసే వివరాలు సమకూర్చనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఎవరైతే తమతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోలేదో ఆ దేశాలు అధిక సుంకాలు చెల్లించాల్సి వస్తుందని ట్రెజరీ కార్యదర్శి హెచ్చరించారు.

సుంకాలపై ఉన్న డెడ్‌లైన్‌ను పొడగించవచ్చు లేదా కుదించవచ్చు అంటూ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 90 రోజుల గడువు జూలై 9తో ముగియనుంది. ఇప్పటికే అమెరికా పలు దేశాలతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది.   

వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు ఆమోదం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కలల బిల్లు అయిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ను అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. గురువారం సుదీర్ఘ చర్చ అనంతరం జరిగిన ఓటింగ్‌లో బిల్లు ఆమోదం పొందింది. బిల్లుకు  అనుకూలంగా 218..

వ్యతిరేకంగా 214 ఓట్లు వచ్చాయి. కాగా బిల్లును ఇద్దరు రిపబ్లికన్లు వ్యతిరేకించారు. అంతకముందు బిగ్ బ్యూటిఫుల్ బిల్లు సెనెట్‌లో ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. ట్రంప్ సంతకం తర్వాత బిల్లు చట్టంగా మారనుంది. పన్నుల్లో కోతలు, వ్యయ నియంత్రణ లక్ష్యంగా ఈ బిల్లును ట్రంప్ తీసుకొచ్చారు.