14 July, 2026 | 4:49 PM

Breaking News

ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •  

వ్యక్తులను మేనేజ్ చేస్తేనే చాన్సులు

26-06-2024 12:05 AM

బిగ్ బీ వారసుడు అభిషేక్ బచ్చన్ సరసన ‘ధూమ్’ధామ్ చేసింది.. ఈ ‘అందరివాడు’ నా వాడు కూడా అంటూ మెగాస్టార్‌తో జత కట్టింది.. అలా బాలీవుడ్‌లోనే కాక టాలీవుడ్ చిత్రాలతోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.. తెలుగు, హిందీ, బెంగాళీ చిత్రాల్లో నటించిన ఆ కలకత్తా అందం పేరు రిమీ సేన్. 2003లో వచ్చిన హిందీ సినిమా ‘హంగామా’తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ భామ ‘గరమ్ మసాలా’, ‘ఫిర్ హేరా ఫేరీ’, ‘క్యూన్ కి’, ‘గోల్‌మాల్’ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అయితే, తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పింది.

“ఇక్కడ (బాలీవుడ్) నా పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదు. కేవలం నాది ఫర్నీచర్ రోల్. ‘హంగామా’, ‘జానీ గద్దర్’ లాంటి సినిమాల్లోనే మంచి పాత్రలు చేశా. తర్వాత అలాంటి క్యారెక్టర్స్ రావాలిని కోరుకున్నా. కానీ అలా జరగలేదు. అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్‌లతో కలిసి పనిచేసినప్పటికీ పరిశ్రమలో ఎవరితోనూ పెద్దగా కనెక్ట్ కాలేకపోయా” అని వివరించింది. ఇండస్ట్రీ గురించి ఇంకా చెప్తూ.. ‘కామెడీ సినిమాలతో విసిగిపోయి నటనకు దూరంగా ఉన్నా.  యాక్టింగ్‌లో టాలెంట్ చూపిస్తే సరిపోదు.. అంతకన్నా ముందు వ్యక్తు లను ఎలా మేనేజ్ చేయాలనేది తెలుసుకోవాల్సి ఉంటుం ది. లేకపోతే మీ టాలెంట్ స్టోర్ రూమ్‌కే పరిమితమవుతుంది. అవకాశాల కోసం అందరినీ అడుక్కోవడం, పీఆర్ చేయడం నాకు రాదు’ అని తెలిపింది రిమీ సేన్.