14 July, 2026 | 4:44 PM

Breaking News

ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •  

ఒక్క ఓటరు నష్టపోవద్దు

14-07-2026 04:09 PM

- ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్ దరఖాస్తు సమర్పించాలి

- ఎంఎల్ఏ జాదవ్ అనిల్

బోథ్,(విజయక్రాంతి): అర్హులైన ప్రతి ఒక్కరు ప్రభుత్వం చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమంలో దరఖాస్తులను సమర్పించుకోవాలని ఎమ్మెల్యే జాదవ్ అనిల్ కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో ఎస్ఐఆర్ ప్రక్రియ అమలు తీరును పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఒక్క ఓటు కూడా గల్లంతు కాకుండా చూసుకోవాలని, ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న ఓటర్లకు సమాచారం అందించాలని కోరారు. అనంతరం బిఎల్వోలు నిర్వహించిన ఫైళ్లను పరిశీలించి, క్షేత్ర స్థాయిలో కలుగుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. తహసిల్దార్ సుభాష్ చంద్ర, ఎంపీడీవో రమేష్ లతో మాట్లాడుతూ ఏ ఒక్క ఓటరు నష్టపోకుండా బాధ్యతగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. రెండు చోట్ల ఓటు హక్కు ఉంటే గుర్తించి తగు న్యాయం చేయాలన్నారు.