14 July, 2026 | 5:00 PM

Breaking News

అబాకస్ పోటీల్లో రాష్ట్ర స్థాయి విజేతలుగా బ్లూ బెల్స్ విద్యార్థులు   •   రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కేరళ మోడల్ హై స్కూల్ విద్యార్థులు   •   20లోగా ఓటర్ల సవరణ పూర్తి చేయాలి: కలెక్టర్ రాహుల్ శర్మ   •   ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •  

రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన

14-07-2026 04:23 PM

చివ్వెంల,(విజయక్రాంతి): బీఆర్ఎస్ నేతల రక్తంతో వ్యవసాయం చేయిస్తానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ సూర్యాపేట నియోజకవర్గంలోని చివ్వెంల మండలం సేవాలాల్ తండా ఆవాసం పందిబండ తండాకు చెందిన రైతులు మంగళవారం వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు తమ చేతుల నుంచి రక్తాన్ని తీసి పంట పొలాల్లో చల్లుతూ నిరసన వ్యక్తం చేశారు.

వ్యవసాయం రైతుల చెమట, శ్రమ, త్యాగాలతో సాగుతుందని, రైతుల మనోభావాలను దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను అవమానించేలా మాట్లాడటం తగదని, వ్యవసాయంపై రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కోరారు. ఈ నిరసనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో చర్చనీయాంశంగా మారాయి. పందిబండ తండా రైతులు చేపట్టిన ఈ వినూత్న నిరసన పలువురి దృష్టిని ఆకర్షించింది.