20 April, 2026 | 7:44 PM

ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

20-04-2026 06:22 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండల కేంద్రమైన గరిడేపల్లిలో మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.మండల టిడిపి అధ్యక్షులు కీసరి నాగయ్య కేక్ కట్ చేసి అభిమానులకు స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసిన చంద్రబాబు నాయుడు పాలనలో  రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. ప్రధానంగా ఐటీ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి దేశంలోనే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్న హైదరాబాదును తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.

ఆయన పాలనలో అనేక సంక్షేమ పథకాలను పేద బడుగు బలహీన వర్గాలకు అమలుచేసి ఆదర్శంగా నిలిచారన్నారు. పార్టీ వ్యవహారాల్లో కూడా బీసీ అట్టడుగు వర్గాలకు అత్యున్నత స్థానాలను అందించి రాజకీయ పార్టీలలో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందాలని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రస్తుతం పని చేస్తున్న చంద్రబాబు మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజలను మరింత గుర్తింపు పొంది చరిత్రలో నిలిచిపోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాతకోటి లింగారెడ్డి తో పాటు పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.