10 June, 2026 | 2:58 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

చంద్రబాబు ‘టీ’ సూపర్ టేస్ట్

02-11-2024 12:31 AM

ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీం ప్రారంభం

శ్రీకాకుళం, నవంబర్ 1: సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిం చారు. దీపం 2.0లో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని ఈదుపురంలో మహిళా లబ్ధాదారు శాంతమ్మ ఇంటికి చంద్రబాబు వెళ్లి  ఉచిత గ్యాస్ సిలిండర్‌ను స్వయంగా అందజేశారు.

ఈ సంద ర్భంగా ఆమె కుటుంబసభ్యులతో మాట్లాడారు. అనంతరం లబ్ధిదారుడి  కిచెన్‌లోకి వెళ్లిన చంద్రబాబు గ్యాస్ స్టవ్ వెలిగించి స్వయంగా టీ(చాయ్) తయారు చేశారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్‌కు అందించి వారితో పాటు చంద్రబాబు తాను తయారు చేసిన చాయ్‌ను తాగారు.

ఈ పథకంలో భాగంగా ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లను ఇస్తారు. ఆ తరువాత మరో లబ్ధిదారు ఇంటికి వెళ్లి ఒంటరి మహిళ  పింఛన్ అందజేశారు. ఆ కుటుంబానికి ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చి, రేపటి నుంచే పనులు ప్రారంభించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.