1 August, 2026 | 9:40 AM

సమన్వయంతో గ్రామాభివృద్ధి సాధ్యం

01-08-2026 08:42 AM

తాసిల్దార్ ఫర్హిన్ షేక్

హత్నూర : ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయం తో పనిచేస్తే గ్రామాల అభివృద్ధి వేగవంత మవుతుందని హత్నూర తహసీల్దార్ ఫర్హిన్ షేక్ అన్నారు. శుక్రవారం హత్నూర రైతు వేదికలో ఎంపీడీవో శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆమె హాజరయ్యారు. ఈసమావేశంలో సర్పంచులు తాగునీరు, విద్యుత్, రెవెన్యూ, గృహనిర్మాణం, ఆరోగ్యం తదితర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మిషన్ భగీరథ నీటిని పరిశ్రమలకు కాకుండా గ్రామాల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.  సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మణిదీప్, సర్పంచ్ శ్రీహరి, వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.