వన్డే, టీ20 వరల్డ్‌క ప్‌లో మార్పులు
- 2027 వన్డే ప్రపంచకప్‌లో సూపర్
- టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 10
- సెమీస్‌కు ముందు ఎలిమినేటర్ మ్యాచ్‌లు
- ఐసీసీ కీలక ప్రతిపాదనలు
దుబాయి, జూలై 15 : వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో సరికొత్తగా అభిమానులను అలరించబోతున్నాయి. అభిమా నులకు మరింత వినోదం అందించడమే లక్ష్యంగా ఐసీసీ కీలక ప్రతిపాదనలు సిద్ధం చే సింది. పురుషుల వన్డే, టీ20 ప్రపంచకప్ ఫార్మాట్లలో భారీ మార్పులు చేయబోతోంది. ఇటీవల ముగిసిన ఐసీసీ సమావేశం లో దీనిపై చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మెగాటోర్నీల్లో పోటీ స్థాయిని పెం చి, ప్రతీ మ్యాచ్ పైనా మరింత ఆసక్తి, ప్రాధాన్యత ఉండేలా చూడడమే లక్ష్యంగా ఈ ప్రతి పాదనలు ఉన్నాయి.
అభిమానులకు మరిం త రసవత్తర అనుభవం అందించడమే వీటి లక్ష్యమని ఐసీసీ చెబుతోంది. ఐసీసీ కొత్త ప్రతిపాదన ప్రకారం 2027 వన్డే ప్రపంచకప్‌లో 14 జట్లు ఆడనున్నాయి. అంతకుముం దు 2019, 2023 ఎడిషన్లలో 10 జట్లు మాత్రమే పాల్గొనగా, 12 ఏళ్ల తర్వాత 14 జట్లతో టోర్నీ నిర్వహించబోతున్నారు. కొత్త ఫార్మాట్లో 12, 13, 14 స్థానాల్లో ఉన్న మూ డు జట్లు మొదటి దశలో పోటీ పడతాయి. వీటిలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ప్రధాన టోర్నీకి అర్హత సాధిస్తుంది.
ఆ తర్వాత 12 జట్లను రెండు గ్రూపులుగా డివైడ్ చేస్తారు. ప్రతీ గ్రూపులో ఆరు జట్లు ఉంటాయి. రెం డు గ్రూపుల నుంచి తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లతో పాటు, రెండు గ్రూపుల్లో అత్యుత్తమంగా నిలిచిన మరో జట్టు సూప ర్ దశకు అర్హత సాధిస్తుంది. గతంలో ఉన్న సూపర్ 6 స్థానంలో ఇప్పుడు సూపర్ 7 ఉండబోతోంది. ఈ స్టేజ్‌లో అత్యుత్తమ స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్లో అడుగుపెడతాయి. మరోవైపు 2028 టీ20 ప్రపంచకప్ లోనూ మార్పులు జరగనున్నాయి.
ఈ మెగా టోర్నీలో యథావిధి గా 20 జట్లు పాల్గొంటాయి, కానీ లీగ్ మరి యు నాకౌట్ దశలలో కీలక మార్పులు చేశా రు. గతంలో లాగా 5 జట్లతో 4 గ్రూపులు కాకుండా, ఈసారి 4 జట్లతో 5 గ్రూపులుగా విభజించారు. దీనివల్ల మొదటి రౌండ్ మ్యా చ్‌ల సంఖ్య 40 నుంచి 30కి తగ్గుతుంది. ప్రతి గ్రూప్ నుండి టాప్ జట్లు తర్వాతి రౌండ్‌కు వెళతాయి. గతంలో ఉన్న సూపర్ 8 స్థానంలో కొత్తగా సూపర్ దశను ప్రవేశపెట్టారు. అర్హత సాధించిన 10 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు.
సూపర్ రెండు గ్రూపులలో టాపర్లుగా నిలిచిన రెండు జట్లు నేరుగా సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. మిగిలిన రెండు సెమీస్ స్థానాల కోసం సరికొత్తగా ఎలిమినేటర్ రౌం డ్ నిర్వహించనున్నారు ఒక గ్రూపులో 2వ స్థానంలో ఉన్న జట్టు, మరో గ్రూపులో 3వ స్థానంలో ఉన్న జట్టుతో ఎలిమినేటర్ మ్యా చ్ ఆడుతుంది. అందులో గెలిచిన జట్లు సె మీస్ చేరుకుంటాయి ఈ కొత్త మార్పులకుపై మార్పులకు ఐసీసీ డెవలప్‌మెంంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ ఇప్పటికే ఆమోదం తెలిపింది. అయితే ఈ ఏడాది నవంబర్‌లో జరి గే ఫైనాన్స్ అండ్ కమర్షియల్ అఫైర్స్ కమి టీ తుది నిర్ణయం తీసుకుంటుంది.






